ప్రేమ - ఒక ఇంజనీరింగ్ అమ్మాయి జీవితంలో జరిగిన కథ

అప్పటికి నాకు పంతొమ్మిదేళ్ళ, అబ్బాయి అమ్మాయి చనువుగా మాట్లాడుకోవడం తప్పు అని చిన్నప్పటినుండి అందరూ సహజంగా అనుకుని చెప్పిన ఆలోచనల నుండి అప్పుడప్పుడే బయటపడుతున్న రోజులవి. 
ప్రేమంటే?
ప్రేమంటే ఏంటి అని అడిగితే, 

క్లాసులు బంక్ కొట్టి వెళ్లడం, పార్కుల చుట్టూ తిరగడం, చదువు మీద శ్రద్ధ పోవడం... 
ఇలాంటివన్ని దేనివల్ల జరుగుతాయో అదే ప్రేమ. ఆ వయసులో దాని జోలికి ఏ మాత్రం వెళ్ళకూడదని మనసులో గట్టిగా నిర్ణయించుకున్న అమ్మాయిల్లో నేను కూడా ఒక అమ్మాయిని. 

అప్పుడు నేను బి.టెక్ రెండవ సంవత్సరం,

అందరిలానే రోజూ కాలేజీకి వెళ్లి సాయంత్రం కాగానే కాలేజీ బస్సులు పెట్టె చోట కబుర్లు చెప్పుకునే బ్యాచ్ మాది. కాలేజీలో క్లాసులు 3:40కి పూర్తయితే బస్సులు నాలుగింటికి బయల్దేరుతాయి. రోజూ లానే ఆరోజు కూడా, నేను నా ఫ్రెండ్స్ ప్రియా, లలితా, కమల, అందరం బస్సుల దగ్గరకి నడుస్తూ వెళ్తున్నాం, కొత్తగా కాలేజీలో ఫ్రెష్ ఛాయస్ అవుట్-లెట్ పెట్టడం వాళ్ళ, అది బస్సులు పెట్టె చోటుకి వెళ్లే దారిలో ఉండడం వాళ్ళ సాయంత్రం అయితే ఆ ప్లేస్ అంత చాల రద్దీగా ఉండేది. అందరూ బాతాకాని కొట్టుకుంటూ 
అటూ- ఇటూ నడుస్తూ గజిబిజిగా ఉండేది. 

ఇంతలో ప్రియా, "ఆకలేస్తుందే, ఏమైనా తిందాం" అనగానే,
నేను "ఐస్ క్రీం కావలి అన్నాను" 
అతి కష్టం మీద, రెండు ఐస్-క్రీమ్స్ కొనుక్కొని, అంత మంది జనం నుండి తప్పించుకుంటూ బయటపడ్డాము. అది ఒక ఫుట్-పాత్ లాంటిది. పక్కనే చాలా పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్ చుట్టూ కూర్చోడానికి సిమెంట్ బెంచెస్ కూడా ఉండేవి. అక్కడే చాల మంది అబ్బాయిలు క్రికెట్ బాల్స్ తో కాచ్స్ ఆడుతూ ఉండేవారు. లలిత, కమల పూర్ణ మార్కెట్ బస్సు దగ్గరకి, నేను, ప్రియా మధురవాడ బస్సు దగ్గరకి వెళ్లిపోయాం. 

సమయం నాలుగు అవుతున్నా, ఏదో సెమినార్ జరుగుతుండటంతో కొంతమంది ఫాకల్టీ రాకపోవడంతో బస్సులు తియ్యకుండా అలానే ఉంచారు. 

నేను డ్రైవర్ సీటుకి వెనుక సీట్లో కూర్చున్నాను. నా పక్కన ప్రియా. గాలి కోసం కిటికీ తీర్చి యాదృచ్చికంగా కొంచం దూరంలో క్రికెట్ బాల్ తో కాచ్స్ ఆడుతున్న కొంత మందిని చూసా, కానీ వాళ్ళందరిలో ఒక మెరూన్ కలర్ షర్ట్, ఒక నేవీ బ్లూ గీతలు డామినెట్ చేశాయి. ఆటోమేటిక్ గా నా కళ్ళు ఆ షర్ట్ వైపు, తరువాత ఆ షర్ట్ వేసుకున్న ఆ అబ్బాయి వైపు చూశాయి. తను బస్సు వైపు చూస్తున్నాడు, కానీ అది నన్నేనా? లేదా ఇంకెవరిరోనా? అయినా నన్నెందుకు చూస్తాడు. నేనింతవరకు ఎప్పుడూ తనని చూసినట్టుగా గుర్తులేదు అని కిటికీ తలుపు వేసేసాను. 

మళ్ళీ ఎందుకు చూడాలనిపించిందో తెలియదు. కానీ, చూసాను. తను అప్పటికీ మా వైపే చూస్తున్నాడు. అయినా అర్ధం కాలేదు ఎవరికోసమో అని. 
వెంటనే నా పక్కనే ఉన్న ప్రియాని పిలిచి, "చూడు తను మన వైపే చూస్తున్నాడు" అని అంటుండగానే,

"మన కాదు, నీ వైపు చూస్తున్నాడు" అని నవ్వుతూ సటైర్ వేసింది. 
"అయ్యో లేదే, తనెవరో నాకు తెలియదు" అన్నాను. 
"తెలిస్తేనే చూడాలా ఏంటి? సరే అయితే రా బస్సు దిగి, కంఫర్మ్ చేసుకుందాం" అన్నాది. 

నాలో ధైర్యం, బస్సు దిగేలా చేసింది. అప్పుడు అర్ధమైంది తను చూస్తున్నది నన్నే అని. చాలా కొత్తగా అనిపించింది. ఎవరో ఏంటో కూడా తెలియదు, బహుశా నేను తనకి తెలుసా? అనుకున్నాను. 

బస్సులు బయల్దేరాయి. మళ్ళీ అటువైపు చూస్తే అప్పటి వరకు తను అనుకోని ఉన్న బెంచ్ పక్కన ఎవరు లేరు. వదిలేసి, ఇక ఆ విషయం మర్చిపోయాం. 

మరుసటి రోజు నేను కాలేజికి వెళ్ళలేదు. ఆ తరువాత రోజు వెళ్ళగానే నా పక్క బెంచ్లో కూర్చున్న అబ్బాయిలు, "ధీరజ, ఎవరా అబ్బాయి" అని అడిగారు. 

నాకు అసలు ఆ విషయమే గుర్తుకు రాక,"ఎవరు ?" అని అడిగాను. 
దానికి వాళ్ళు, "ఎవరో తెలియకుండానే, బస్సులో నీ ప్లేస్ వైపే చూస్తూ ఉండిపోయాడా?" అన్నారు. 

ప్రియా వాళ్ళకి చెప్పిందని తరువాత అర్ధమైంది నాకు. 

నాకు అంతా వింతగా అనిపించింది, "మరీ అంతే సీన్ చెయ్యకండి. తరువాత మాట్లాడదాం" అని చెప్పి మాట మార్చేసా. ఆ రోజు సాయంత్రం మళ్ళీ అదే ప్లేస్, మళ్ళీ అదే బెంచ్. తను నా వైపే చూస్తున్నాడు నేను పట్టించుకోనట్టు వదిలేసాను. 

బస్సు స్టార్ట్ అయింది. తను పరిగెడుతూ బస్సు వైపే వస్తూ చూస్కోకుండా ఫుట్-పాత్ మీద నుండి దూకటానికి ప్రయత్నించి కింద పడిపోయాడు. తన మోచెయ్యి కొట్టుకుపోయింది. తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి లేపి తీసుకోని వెళ్లిపోయారు. 

ఆ రోజు తెలిసింది తను మా బస్సే అని.  ఆ తరువాత రెండు రోజులు తను నాకు కనిపించలేదు, అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ చేతికి ఏమయ్యుంటుందో అని నాలో నేనే అనుకునేదానిని.  ఆ మరుసటి రోజు నుండి రెండు వారాలు, ఒక మాట లేదు, ఒక నవ్వు లేదు. కానీ అలా నా వైపే బెంచ్ కి అనుకోని చూస్తూ ఉండేవాడు. 

ఈ విషయం లలితకి,  కమలకి తెలిసింది.  మేము ఆ రోజు మధ్యాహ్నం కాంటీన్ కి వెళ్తూ తన గురించే మాట్లాడుకుంటున్నాం, అంతే ఎదురుగా కనిపించాడు. తన ఫ్రెండ్స్ తో కాంటీన్ నుండి బయటకి వస్తూ నన్ను చూడగానే మళ్ళీ కాంటీన్ వైపు వెళ్లిపోవడం నేను చూసాను. మేము తినేసి మళ్ళీ క్లాసుకి వెళ్లిపోతుంటే, "ఎస్క్యూజ్ మీ ధీరజ?" అని ఒక గొంతు వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూస్తే, తానే పరిగెడుతూ వస్తున్నాడు నా వైపు, చాల కంగారు పడిపోయా. 
దగ్గరకంటూ వచ్చి, "ధీరజ నా?" అని అడిగాడు. అదే మొదటిసారి తన మాట వినడం. 
"అవును. మీరు?" అని అడుగుతూ తన మేడలో ఐడీ కార్డు చూసాను. అప్పుడు అర్ధమైంది తను నాకు సీనియర్ అని. మాకు ఇయర్ వైస్ ఇదీ కార్డు టాగ్స్ మారుతూ ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడు తను 
ఐడీ కార్డుతో కనిపించలేదు. 

నా ప్రశ్నకి తనింకా సమాధానమివ్వకముందే, నేను తిరిగి మా వాళ్ళతో కలసి క్లాస్ వైపు బయల్దేరిపోయాను, వెనక్కి తిరిగి చూడలేదు, తను పిలిచినట్టు కూడా అనిపించలేదు. 

సాయంత్రం బస్సు దగ్గరకి వచ్చేసరికి బాగా కంగారు పడిపోయా. 

వస్తూనే, "ధీరజ ఒక్కసారి కిందకి రా" అని పిలిచాడు. 
అంతలోనే, తన ఫ్రెండ్ సంతోష్ వచ్చి, "అదేంట్రా అడుగుతావ్ సీనియర్, నువ్వు పిలిస్తే రాదా. పిలువు అన్నాడు"

భయంగా నేనే కిందకి దిగిపోయా, సంతోష్ ని పంపించేసి, నాలో కంగారు గమనించి, "కంగారు పడకు. సీనియర్ అని బయపడుతున్నావా?" అన్నాడు. 
నేను దానికి ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగానే చూస్తూ ఉండిపోయా. 
"కంగారు పడకు. నేను నీలానే వన్ ఇయర్ అవుతుంది వచ్చి. లాటరల్ ఎంట్రీ. ఇంతకీ నా పేరు తెలుసా నీకు?" అని అడిగాడు. 
దానికి నేను కాస్త కోపంగా కంగారుగా చూసేసరికి, సరే ఇదిగో నా ఐడీ కార్డు మీద చూడు అని కార్డు కాస్త ముందుకి తీసాడు. 
నేను కార్డు వైపే చూస్తూ, "ప్రదీప్. ప్రదీప్ సింగ్ ?" అంటూ అయోమయంగా తన కళ్ళలోకి చూసాను. అద్భుతమైన కళ్ళు. చాలా బావున్నాయి. కుడి కంటి కింద పుట్టుమచ్చ కూడా స్పష్టంగా కనిపించింది నాకు. ఆ రోజు ఆ కళ్ళు నాలో ప్రేమను పుట్టించాయి. 

ఈరోజు మే 5 తన పుట్టినరోజు. ఇంత అర్ధరాత్రి వేల తనకోసం వెయిట్ చేస్తూ ఈ నా 'తన పరిచయం' కాంటెస్ట్ కోసం నా జీవితంలో తన పరిచయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.


*** ***
పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 




*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***