ఆగిపోయిన నా జీవితం మళ్ళీ మొదలుపెట్టాలని ఉంది



సంతకం పేజీకి వచ్చిన ఒక ప్రశ్న


మీ రచనలు నాకు చాలా స్ఫూర్తినిస్తున్నాయి. 
ఆగిపోయిన నా జీవితం మళ్ళీ మొదలుపెట్టాలని ఉంది. కానీ ఏదో భయం,
చేదు అనుభవం ఎదురవుతుందేమో అని. ఈ భయాన్ని ఎలా పోగొట్టాలి?

ముందుగా సంతకం రచనలు ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు.
అందులోనూ, నా రచనలు మీకు స్ఫూర్తినివ్వడం నాకు చాల సంతోషంగా ఉంది.

మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం,
మీలానే ఆలోచిస్తున్న మరికొంత మందికి కూడా చేరేలా రాయాలని ఇలా రాయటం జరుగుతుంది.

ముందు, మీ జీవితం ఆగిపోయిందని మనం భావించేముందు,
అది నిజంగా ఆగిపోయిందా అనే ప్రశ్న మనకి మనం ఒక్కసారి వేసుకోవాలి.

అసలు ఆగిపోవడం అంటే ఏంటి?
అనే ప్రశ్నను మనం పరిశీలనగా పరీక్షిస్తే, మరిన్ని ప్రశ్నలు మనకి ఎదురవుతాయి
ఆ ప్రశ్నలు ఏంటంటే

ఆలోచనలు ముందుకు వెళ్లటంలేదా? 
జ్ఞాపకాలు వెంటాడుతూ ఉండిపోయాయ?
మనం ఆగి ఆలోచిస్తున్న వ్యక్తి మన దగ్గరకు తిరిగి రావాలని కోరుకుంటున్నామా?

ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆ ఒక్క ప్రశ్న నుండి ఉద్భవిస్తాయి.

ఇక ఇలా పుట్టుకొచ్చిన ప్రశ్నలన్నిటికీ మనకి మనం
సమాధానం వెతుక్కుంటూ వెళ్తే సుముహూర్తం కాస్త పూర్తవుతుంది.

'నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో, 
సమయానికి అనుగుణంగా దానిని ఆచరించడం కూడా అంతే ముఖ్యం'
అనేది నా అభిప్రాయం.

ఇక్కడ మీరున్న పరిస్థితిలో నన్ను నేను పెట్టుకొని ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాను.

మీరున్న పరిస్థితుల్లో అంటే, మీ ఆలోచనలో మాత్రమే

నా జీవితం నిజంగా ఆగిపోయిందా అనే ప్రశ్నకు నేను ముందు సమాధానం వెతుక్కుంటాను.

అప్పటికి నా జీవితం ఆగిపోయిందని నాకనిపిస్తే,
తిరిగి మొదలుపెట్టడానికి నేను ఏ మాత్రం ఆలోచించను. భయపడను.
ఎందుకంటే నా జీవితం.
నా కోసం నేను జీవిస్తున్న జీవితం.

ఒక చేదు అనుభవంతో నా అందమైన జీవితంలో సమయాన్ని వృధా చెయ్యలేను.
ఎందుకంటే,
గడిచిపోయిన సమయం మళ్ళీ రాదనే నమ్మకాన్ని నేను నమ్ముతాను కాబట్టి.


జీవితమంటేనే ముందడుగు వెయ్యడం.

రేపు నిద్రలేవము అని మనకి తెలిస్తే, ఈరోజు ఎవ్వరం నిద్రపోము.
రేపటిమీద నమ్మకంతోనే ఈరోజు నిద్రపోతాము.

అలానే,
ఏదో జరిగిపోతుందేమో అనే భయంతో మన జీవితాన్ని స్థంభించేలా చెయ్యడం మూర్కత్వమే అవుతుంది.


చిన్నప్పుడు తప్పటడుగులు వేసాం,
పడిపోయాం, దెబ్బతిన్నాం.

అలా అని నడకకు భయపడి, నేర్చుకోకుండా వదలేకపోయాం.
ఎలాగైనా నడక నేర్చుకున్నాం.

ఇలానే మన జీవితంలో ముందడుగు అనేది చాల ముఖ్యమైనది అనేది నా భావన.


"మీ జీవితం ఆగిపోలేదండి. ఒక్క క్షణం ఆగి ఆలోచించారంతే.
ధైర్యంగా, ఆనందంగా మీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టండి."


*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***

*** ***
పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక