తన పరిచయం, నాకొక అందమైన జ్ఞాపకం.




తన పరిచయం, నాకొక అందమైన జ్ఞాపకం.
కథ రాస్తున్నంతసేపు, ఏదో తెలియని మధురానుభూతి.

"నీ పరిచయం యాదృచ్చికం కాదు, అదొక అద్భుతం, నేను ఇష్టపడి జీవించాలనుకుంటున్న జీవితం. నువ్వు నాతో పంచుకున్న ప్రతీ మాట, ప్రతీ భావం నన్ను నీకు ఇంకా దగ్గరచేశాయి. పాతికేళ్ళు మీ నాన్న కళ్ళలో బ్రతికిన నువ్వు, యాభై ఏళ్ళు నా గుండెల్లో బ్రతుకుతావా? నన్ను పెళ్లిచేసుకుంటావా?" అంటూ మోకాళ్ళ మీద పడ్డాను. 

ఈ డైలాగ్ రాస్తున్నంతసేపు నాలో ఏదో ఉత్సాహం. 

మనలో చాలా మంది, మనం ప్రేమించే వారితో జీవితంలో ఆ మొదటి పరిచయం గుర్తించం. 
కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ పరిచయం చాల అందంగా ఉంటుంది.

అలాంటి పరిచయాలను పంచుకునేదే, ఈ నా 'తన పరిచయం' కాంటెస్ట్.

మీ జీవితంలో, మీరు ప్రేమించిన వారితో జరిగిన పరిచయాన్ని మాకు వివరంగా చెప్పండి.
మొత్తం 3000 విలువ చేసే బహుమతులు.

కాంటెస్ట్ వివారాలు:

1. మే 14 వరకు వచ్చిన కథలను పరిగణించబడతాయి.
2. వచ్చిన కథలలోమూడు కథలు ఎంపిక చెయ్యబడతాయి. (ఇక్కడ ముగ్గురు విజేతలే)
3. మూడు కథలు మూడు శుక్రవారాలు సంతకం వెబ్సైటులో పోస్ట్ చెయ్యబడతాయి. ఎక్కువ వ్యూస్ వచ్చిన కథని మొదటి స్థానంలో, తరువాతి స్థానంలో ఉన్న కథని రెండవ స్థానంలో, ఆ తరువాతి స్థానంలో ఉన్న కథని మూడవ స్థానంలో ప్రకటించబడతాయి

4. మొదటి స్థానంలో నిలిచిన కథకి ₹1500
    రెండవ స్థానంలో నిలిచిన కథకి  ₹1000
    మూడవ స్థానాల్లో నిలిచిన కథకి  ₹500  విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ వౌచెర్ బహుమతిగా ఇవ్వబడుతుంది.



కాంటెస్టుపై మీకున్న సందేహాలను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. తప్పక స్పందిస్తాము 



*** ***

ప్రేమకు నిర్వచనం చెప్పిన నవల


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 



*** ***