"నాన్న చూడు, మనతో పాటు మేఘాలు ఎలా వస్తున్నాయో"



ఒక ఇరువై నాలుగేళ్ళ అబ్బాయి ట్రైన్ కిటికీ నుండి బయటకి చూస్తూ, 
"నాన్న చూడు చెట్లు ఎలా వెళ్ళిపోతున్నాయో" అన్నాడు. 

దానికి వాళ్ళ నాన్న నవ్వి, తన పనిలో నిమగ్నమైపోయాడు. 
పక్కనే ఉన్న ఒక ప్రేమికుల జంట దీనినంత గమనిస్తూ ఉన్నారు. 

అంతలోనే, "నాన్న చూడు, మనతో పాటు మేఘాలు ఎలా వస్తున్నాయో" 
అంటూ ఆశ్చర్యంగా కిటికీ బయటకి చూస్తూ అన్నాడు. 

ఆ మాటకి, "మంచి డాక్టర్ కి చూపించకపోయారా?" అన్నాడు అక్కడున్న అబ్బాయి. 

దానికి ఆ ముసలాయన నవ్వుతూ, "డాక్టర్ దగ్గరనుండే తిరిగి వస్తున్నాం బాబు. మా వాడికి ఈరోజే చూపు వచ్చింది. పుట్టుకనుండి చూపు లేదు" అన్నాడు. 

ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. 

వారిని చూసి ఒక నిర్ణయానికి రావటం మంచిది కాదు. 

నిజం మనల్ని ఆశ్చర్యపరచొచ్చు. 

"Don't Judge a book by its cover"

*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***
*** ***

పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక