జీవిత కథలు - 9


ఈ కథ సంతకం పేజీకి వచ్చినది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది నేను ఆలోచించలేదు. ఎందుకంటే కనీసం 0.0001% ఇది నిజమైన కథ అయినా, ఇది పాఠకులతో పంచుకోకపోతే ఒక మంచి భావాన్ని మీకు అందకుండాపోతుందనిపించింది.
గతవారం వచ్చిన కథ.

రెడ్ కలర్లో ఉన్నవి, ఆమె టైపు చేసిన కథ నుండి తీసుకోబడినవి

పంపించిన వారి కోరిక మేరకు, ఆమె పేరు భయటపెట్టటంలేదు.

ఇక కథ ఏంటో ఆమె మాటల్లోనే చదువుదాం


నా ఇంటర్మీడియట్ అయిపోయాక, నేను డిగ్రీ జాయిన్ అవుదామని కాలేజెస్ వెతుకుతున్న సమయంలో, మా చెల్లెల్లు స్కూల్ మారింది. అందుకోసం రోజు తనని తీసుకెళ్లి వచ్చేదానిని. ఆ క్రమంలో ఒకబ్బాయిని చూసాను. తను కూడా నన్ను చూడటం నేను గమనించాను.


ఎందుకో తెలియదు, మళ్ళీ మళ్ళీ చూడాలనే ఆశ కలిగేది. చాల ఆనందంగా ఉండేది. బహుశా ఇదేనేమో ప్రేమంటే అనుకుంటున్నా సమయంలో తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసింది. ఆ పరిస్థితి విని తన మీద ప్రేమ మరింత ఎక్కువైంది. రోజులు గడుస్తున్నకొద్దీ మాటలు కలపడానికి ప్రయత్నించేవాడు. ఒక రోజు వచ్చి ప్రొపొస్ చేసేసాడు. ఇంత త్వరగా ప్రొపోజ్ చేస్తారని ఊహించని నాకు, ఉన్నపలంగా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాలేదు. కానీ నాకు ఇష్టమైనదే జరుగుతున్నందునకో ఏమో మరి వెంటనే 'ఎస్' చెప్పేసాను. కానీ ఒక్క వారంలో తనకు ఒంట్లో బాగోలేకపోవడం మొదలైంది. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కొద్దిరోజుల్లో ఆయనకి కాన్సర్ అని డాక్టర్లు నిర్ధారించారు. ఎక్కువ కాలం బ్రతకరు అని కూడా తేల్చి చెప్పేసారు. అదంతా విని, నాకు ఒకటే అనిపించింది. తనతో కలసి పుట్టలేదు. కలసి చావలెను. కానీ తను బ్రతికినంతకాలం తనతో కలసి బ్రతకాలనిపించింది. కాని అతనికి ఈ విషయం తెలిసి, నా జీవితం పాడవుతుందనో ఏమో మరి, నన్ను దూరం పెట్టారు. నా జీవితాన్ని నన్ను చూసుకోమన్నారు. కాని దానికి నేను ఒప్పుకోలేదు. అసలు నా దురదృష్టం కాకపోతే, జీవితాంతం కలసి బ్రతకాలనుకున్న నాకు చాలా కొద్దిరోజుల్లోనే ఇలా జరుగుతుండటం తట్టుకోలేకపోయాను.


"athani tho nenu kalisi petaledu kalisi chavalenu kani brathikinathakalam prathi sec athani tho brathakali ani anipichindhi"



కాని, మన తలరాత అలా ఉంటె ఎవరిని నిందించలేము. అతనికి ఎలాంటి చేదు అలవాట్లు లేవు, అతనొక మంచి డాన్సర్. ఈటీవీ 'ఢీ' ప్రోగ్రాంలో కూడా సెలెక్ట్ అయ్యారు. కాని అనుకోని పరిస్థితుల్లో పార్టిసిపేట్ చెయ్యకుండానే వచ్చేయాల్సొచ్చింది. ఎం.ఏ చేసిన తను ఇప్పుడు ఉన్నదంతా ట్రీట్మెంట్ కోసమని అమ్ముకొని, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని డాక్టర్లు నిర్ధారించారు.

ఇప్పుడు తను ఎవరు లేని అనాధగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను చాలమంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మొత్తానికి ఒక పదివేల రూపాయలు ఆయనికి ఇచ్చాను. మా ఇంట్లో ఆ విషయం తెలిసిపోయింది. ఇదంతా తెలిసి, నన్ను ఇంట్లో బందించేసారు.

ఇప్పుడు నాకు అతను ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. అతని బాధ గుర్తుకువచ్చినప్పుడల్లా, ఆ కాన్సర్ నాకొచ్చినా బావున్ను అనే ఫీలింగ్ కలుగుతుంది. తన బాధ చూడలేక, నేను పడుతున్న వేదన నన్ను సూసైడ్ కోసం ప్రయత్నించేలా కూడా చేసింది. కాని ఆ దురదృష్టం మళ్ళీ నా వెంటే ఉంది. ఆ దేవుడికి కూడా నన్ను తీసుకుపోవడం ఇష్టంలేదేమో అనిపిస్తుంది. అందుకే ఇలా బ్రతికి ఉన్నా శవంలా మిగిల్చేసాడు.



"athani badha chusina prathi sari A cancer naku vachina bagun ani anukuntu unatanu athani badha chudaledaa athanu lekapothe emi aypothavo ana bhayam tho nenu suside chesanu kani na bad luck nenu brathiki una devudu ki kuda nenu na badha numchi thapinchukodam istam ledu anukunta anduke nannu ekada ela brathiki una sevam la unichisadu"


ఈ కథ రాసి పంపించిన అమ్మాయికి సంతకం మాట:

ఈ పోస్ట్ గాని నువ్వు చూసి చదువుతున్నట్లైతే, 
నువ్వు రాసి పంపించిన ఈ కథ యధార్ధమే అయితే,
నీకోసమే నేను రాస్తున్న కొన్ని పదాలు ఇవి.
నువ్వు ఉన్న సందర్భం గురించి ఎక్కువగా మాట్లాడను.
కానీ ఏదేమైనా, ఆత్మ హత్య చేసుకోవడం తప్పు.

ఆ తప్పు ఒక్కసారి చేసావు. మళ్ళీ పునరావృతంకాకుండా చూసుకుంటావని ఆశిస్తున్నాము.
నువ్వు తనమీద చూపిస్తున్న ప్రేమ చాల గొప్పది.
అలాంటి గొప్ప ప్రేమ కూడా చచ్చిపోతే, ప్రేమకు అర్ధం లేకుండా పోతుంది.

ప్రేమించడమంటే, కలసి బ్రతకడం, కలసి చనిపోవడం కాదు.
అందమైన జ్ఞాపకాలను ఏర్పరుచుకోవడం.
అలాంటి జ్ఞాపకాలతో జీవితాన్ని ముందుకు నడిపించడం.


*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమనో బాధనో ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాను.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***
*** ***

ప్రేమకు నిర్వచనం చెప్పిన నవల


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక