నిజమైన ప్రేమ ఎప్పటికైనా ఓడిపోతుందా?


ఆలోచింపజేసిన ఒక ప్రశ్న

నేను చాల మందిని చూసాను.
ప్రాణంలా ప్రేమించేవాళ్ళు కలుసుకోరు. వాళ్ళ ప్రేమ ఎందుకు గెలవదు?
ఆ దేవునికి కూడా ఇష్టం ఉండదా? విడగొడతాడు
నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోతుందా?

ప్రేమ 
ఎలాంటి మనిషినైనా కదిలించగలిగే ఒకే ఒక్క పదం. రెండు వేర్వేరు హృదయాలను ఒక్కటిగా చేసే భావం 

మిగతా అన్ని బంధాల లానే ప్రేమ కూడా ఒక బంధం.
ఒక అబద్ధమైన బంధం ఎప్పటికి ఉండదు.

అలానే, నిజమైన ప్రేమ అనే కాన్సెప్ట్ లేదనేది నా అభిప్రాయం.

ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కో రకంగా ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటాడు.
అలానే, తను ప్రేమించే విధానంలో మార్పు ఉంటుందేమో గాని
ప్రేమ నాణ్యతలో మార్పు ఉండదేమో అనిపిస్తుంటుంది.

కనుక, ప్రేమ అంటేనే నిజం.
నిజం కాని దానికి ప్రేమ అనే ఒక గొప్ప పదం వాడటం సరికాదేమో.

ప్రాణంలా ప్రేమించేవాళ్ళు కలుసుకోరు. వాళ్ళ ప్రేమ ఎందుకు గెలవదు?
నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోతుందా?

గెలుపు...  ఓటమి...

ఇక్కడ అవసరం లేకపోయినా, నాలుగు వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను.

గెలుపు,

 నేను చిన్నప్పుడు నా స్కూల్లో వంద మార్కులు వస్తే, నాకు అదే విజయం. అదే నా గెలుపు.
ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి, ఆ వంద కాస్త వెయ్యి మార్కులు అయ్యాయి...
ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఒక ఉద్యోగం సాధించడం గెలుపేమో అనిపించేది.
ఉద్యోగంలో చేరాక, ప్రమోషన్ తెచ్చుకోవడం గెలుపేమో...

ఇలా సందర్భానుసారం గెలుపు గమ్యం మారుతూ వచ్చింది.

అలానే, ఒక అమ్మకి పిల్లల సంతోషం గెలుపు.
నాన్నకి పిల్లల ఎదుగుదల గెలుపు.

ఇలా ప్రతి మనిషికి, ప్రతి మనిషికి వచ్చే ప్రతి సందర్భానికి గెలుపు గమ్యం మారిపోతుంది.

ఇక మన ప్రశ్న విషయానికి వచ్చేద్దాం.

ప్రాణంలా ప్రేమించుకునే వారు చాల మంది కలవరు. వాళ్ళ ప్రేమ ఎప్పుడు ఓడిపోతుందా?   

గెలుపోటములకు అతీతమైనది ప్రేమ.

ప్రేమ ఎప్పటికి ఓడిపోదు.
ప్రేమికులను ఎవ్వరు విడదీయలేరు.

విడిపోయిన ప్రతీ జంట కారణాల్లోకి తొంగి చూస్తే,
విడిపోవలసిన సందర్భం వచ్చినప్పుడు కూడా,
వారు తీసుకున్న నిర్ణయం వల్లే విడిపోతారు తప్ప, ఎవరో వచ్చి విడగొట్టరు.

అందుకని సమాజాన్నో, కుటుంబాన్నో లేక ఇంకెవరినో నిందించటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం.

ప్రేమికులు కలిస్తే, కలసి జీవిస్తే గెలిచినట్టు కాదు.
విడిపోయి వేరొక పెళ్లి చేసుకొని జీవిస్తుంటే, ఓడిపోయినట్టు కాదు.

కలిస్తే కలసి జీవిస్తారు. విడిపోతే, వేరువేరుగా జీవితాన్ని అర్ధంచేసుకుంటారు.


ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫేసుబుక్లో వాట్సాప్లో ప్రేమించుకుంటున్న కాలంలో ఉన్నాం కాబట్టి.

ప్రేమించుకోడానికి రెండు మనుషుల మనసులు ఎంత ముఖ్యమో...
అందులో విజయం సాధించడానికి, అభిప్రాయలు కూడా అంతే ముఖ్యం

వారి అభిప్రాయలు ముఖ్యమని ఎందుకు అన్నానంటే,
ప్రేమకి పెళ్లి మాత్రమే విజయం కాదు.

ఎందుకంటే, ఎంతో మంది ప్రేమికులు పెళ్లి చేసుకుని విడిపోవడం
మనం రోజు టీవిలో పేపర్లో చూస్తూనే ఉన్నాం.


ప్రేమకు ఓటమి లేదు.


ఈ ప్రశ్న మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి.


*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***
*** ***

పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక