మన బాల్యం - మరపురాని జ్ఞాపకాల కావ్యం





'అనగనగా ఒక పెద్ద ఊరు... ఆ ఊరులో ఒక పెద్ద చెట్టు...'
అంటూ ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తూ  నీతి కథలను చెప్పిన అమ్మ... 

'ఇదిగో ఇది.. ఇది.. నా వేలు పట్టుకో.. గట్టిగా పట్టుకోవాలి'
అంటూ బుడి బుడి అడుగేలాయిస్తూ నడకను నేర్పించిన నాన్న...

'హోమ్ వర్క్ చేసుకొని రాకపోతే, బెంచ్ మీద నిలబెడతా'
అంటూ భయపెట్టి మరీ లెక్కలు నేర్పించిన మన లెక్కల మాస్టారు... 

'ఇదిగో ఒక రూపాయి.. అర్ధ రూపాయి కరివేపాకు తెచ్చి, ఇంకో అర్ధ రూపాయి నువ్వు కొనుక్కో'
అంటూ చిరుతిండ్లను అలవాటు చేసిన అత్త, పిన్ని బాబాయ్, మావయ్య... 

'ఒరేయ్, ఇలా రా, నీకొక మంచి కథ చెప్తాను'
అంటూ లోకజ్ఞానాన్ని బోధించిన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ... 

న్యూ ఇయర్ వస్తే, గ్రీటింగ్ కార్డులు కొని పోస్టు చెయ్యడం
ముగ్గులు వేస్తూ, చూస్తూ జాగారం చెయ్యటం
సంక్రాంతొస్తే, టైలర్ షాపులు చుట్టూ కుట్టడానికిచ్చిన బట్టలకు తిరగడం
శివరాత్రికి, చెట్టుకి కట్టే ఉయ్యాలా ఊగడం
హోలీ వస్తే, జేబు నిండా రంగులు నింపుకోవడం
వినాయక చవితికి, చిన్న పందిరులు వెయ్యటం
దసరాకి, కొనుక్కునే కొత్త బట్టలు వేసుకోవడం 
దీపావళి నుండి నాగుల చవితి వరకు టపాకాయలు దాచుకోవడం 
క్రిస్మస్కి పక్కింటోళ్లిచ్చిన స్వీట్స్ తినడం

బావిలో దూకి ఈత కొట్టిన సందర్భాలు
చెట్టులు ఎక్కి జామకాయలు కోసిన సంతోష సమయాలు 

స్నేహితులని కలుపుకుంటూ స్కూలుకెళ్లిన దారులు...
వైట్ షూస్ కి చాక్ పీస్ రాసుకొని వెళ్లిన రోజులు... 
బ్లాక్ షూస్ ని సాక్సులకి తుడిచేసిన క్షణాలు....
పుస్తకంలో దాచుకున్న నెమలీక... 
పాలు మరగబెట్టి, పెన్సిల్ చెక్కి తాయారు చేసిన యరేజరు ముక్క... 


అద్దెకు సైకిళ్లు
ఆశ చాక్లేట్లు
అరుగు మీద ముచ్చట్లు 
వర్షంలో ఇక్కట్లు 
పావలా లాటరీలు
సిటీ కేబూల్లో హౌసీలు
టీవిలో వీడియో గేములు 
వీ. సీ. ఆర్ క్యాసెట్లు 
జాతరలో చెరుకు కర్రలు
మట్టి డిబ్బీలో చిల్లర డబ్బులు
క్లాసురూములో మట్టి పలకలు 

కాకి చెఱువు 
గుడుగుడు గుంచం 
దాగుడుమూతలు 
అష్ట చమ్మా 
వైకుంఠపాళి 
ముట్టుకున్నాట
దొంగా పోలీస్ 
గోళీలాట 
కర్రా - బిల్లా 
చెమ్మా - చెక్క   


ఇలా ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన మన బాల్యం నిజంగానే ఒక కావ్యం. 

ఇవాళ్టి గొప్పతనమేంటంటే,
మనం ఆనందంగా అనుభవించిన ఎన్నో గొప్ప అనుభూతులు 
గూగుల్ ప్లే స్టోర్లో, ఆపిల్ ఆప్ స్టోర్లో 
డౌన్లోడబుల్ యాప్స్ గా అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటి పిల్లలు ఐపాడ్, ఐఫోన్ స్క్రిన్ల మీద ఆడుతున్నారు. ఆనందపడుతున్నారు. 


మీ బాల్యంలో జరిగి, మీకు గుర్తున్న విషయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి.



*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***
*** ***

పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక