ప్రేమ తరువాత జీవితం




'Every stranger you come across has a story to tell'
'నీకు ఎదురయ్యే ప్రతీ మనిషికి ఒక కథ ఉంటుంది'


అప్పుడెప్పుడో చదివిన ఈ ఇంగ్లీష్ లైన్ నాలో బాగా నాటుకుపోయింది.
ఎన్నో కోటానుకోట్ల కోట్ల కథలు ఈ ప్రపంచంలో ఉన్నాయనే నమ్మకం బలంగా ఏర్పడింది.

కొన్ని కథలు ఆనందాన్నిస్తే, మరికొన్ని కథలు ఆలోచన రేకెత్తిస్తాయి.

అలాంటి కథల్లో ఇదొక కథ
సంతకంకి వచ్చిన కథ.


"నేను ఒకరిని ప్రేమించాను, తను కూడా నన్ను ఎంతగానో ప్రేమించారు. మొదట్లో ఇద్దరం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉన్నా, తరువాత ఇద్దరి ప్రాణం ఒకటే అయింది. ఎక్కడున్నా ఒకే సమయాన్ని తినడం. ఏ పని చేసినా చెప్పి చెయ్యటం అలవాటుగా మారిపోయింది. ఒకరికి నచ్చని పని ఇంకొకరు చేసే వాళ్ళం కాదు. ఎంత కష్టం వచ్చినా, ఒక్కోసారి ఇద్దరం విడిపోయేంత సందర్భాలు వచ్చినా మేము విడిపోలేదు. 
మాట్లాడుకోకుండా ఉన్న రోజులే లేవు"

"అలా సాగిపోతున్న మా జీవితంలో సడెన్గా జరిగిన మా నాన్నగారి మరణం, నన్ను బాగా కృంగిపోయేలా చేసింది. ఆ సమయంలో తను లేకపోతే ఏమయ్యేదాన్నో నేను. చాలా ధైర్యం ఇచ్చారు"

"అదే సమయంలో తనకి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అంతలోనే తన ఇంట్లో వారికి మా ప్రేమ విషయం చెప్పారు. వాళ్ళకి ఇష్టమే కానీ కులం ఒకటి కానందున ఒప్పుకోకుండా, వాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామని బెదిరించారు"

"ఈ విషయం నాకు తెలిసి, ఆ సమయంలో ఏం చెయ్యాలో అర్ధంకాకుండా పోయింది.
విడిచి ఉండలేము, అలా అని కని పెంచిన వాళ్ళకి దూరం అవ్వలేము"

"నేను తనని చేసుకోమని చెప్పేసాను. దానికి ఆయనొక కండిషన్ పెట్టారు. ఎప్పటికి నేను తనతో మాట్లాడుతూనే ఉండమని అడిగారు. అప్పుడు నాకేం చెయ్యాలో తెలియలేదు. 
చావొక్కటే దారనుకున్నాను. కానీ తన వల్లనే బ్రతకాల్సొస్తుంది"

"but tanu naku oka condition pettaru yepatiki NV natho matladutune undali ani"

"నేను నిన్ను వదలను, మా అమ్మని వదలలేను. నువ్వు నాతో మాట్లాడు చాలు, 
నీ నుండి నేనేమి ఆశించటంలేదని చెప్పారు"

"తన పెళ్ళయ్యేంతవరకు ఉంది తరువాత చనిపోదామని అనుకున్నాను.
బ్రతికున్న శవంలా బ్రతుకుతున్నా, తను నాకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నారు"

"nenu okate anukunna tana Pelli aiyevaraku undi tarvatha chanipodam ani,bratikiunna savam la bratukutunna,tanu nakante ekkuva narakam anubavistunaru"

"ఇంతలో తనకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అయినా మా మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక సంవత్సరం నుండి నా ప్రాణం నా చేతిలో లేదు. ఉంటున్న అంటే ఉంటున్నానంతే"

"almost one year ,Na pranam Na chetullo ledu ,untunna Anthe"

"మాట్లాడకుండా ఉంటె, తను బాధపడతారు. మాట్లాడితే నేను ఇంకొకరిని మోసం చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతుంది. తన జీవితంలోకి వచ్చే వాళ్ళు ఎన్నో ఆశలతో వస్తారు. కానీ నేను మాట్లాడాల్సి వస్తుంది"

"ఎన్నో నిద్రలేని రోజులు, ఏడుపులు... ఇంకొక పదిరోజుల్లో తన పెళ్లి. నాకు చావే దారి"

"enno nidraleni rojulu, edupulu ..Inko 10rojullo tana Pelli ,ipudu naku chave daari"

"తను ఇంకొకరితో ఉండటం నేను చూడలేను. కనీసం ఉహించుకోలేకపోతున్నాను. కానీ పెంచిన వారి ఋణం తీర్చుకోడానికి తనిలా చేస్తున్నారు. అలా అని నన్ను విడిచి ఉండలేకపోతున్నారు. ఎన్నో గొడవలు అయినా సరే ఎంతో అండర్ స్టాండింగ్ ఇద్దరికి. ఇప్పటికి నేనే కావాలంట"

"తన తప్పేమి లేదు. నేను అర్ధంచేసుకోగలను. 
మేము విడిపోవడమంటే అది చనిపోయాకే. మాది అలాంటి రిలేషన్"

"tana tappu emledu ,nenu ardam chesukogalanu,
memu vidipovadam ante Adi chanipiyake,alanti relation"

"ఒక సంవత్సరం క్రితం గుడిలో నా నుదిటిమీద సింధూరం కూడా పెట్టారు. తన పెళ్లితో నాకు చావే దారి. మేము ఉన్నామంటే విడిపోలేము, అలా అని బంధాన్ని నేను కంటిన్యూ చెయ్యలేను. 
ఇంకొకరిని మోసం చెయ్యలేను"

*** ***

ఈ కథ నన్ను కదిలించింది.
అందుకే అందరికి తెలియజేయలనిపించింది.

ప్రేమ గురించి అంతగా ఆలోచిస్తున్న వారు, తన కుటుంబం గురించి కూడా అంతే ఆలోచించాలి.
మనం ప్రేమించిన వారు తన కుటుంబం గురించి అలోచించి వేరొకరితో పెళ్ళికే సిద్దమైనప్పుడు,
మనం చనిపోయి మన కుటుంబంలో విషాదం కల్పించకూడదు.

ప్రేమ ఎంత ముఖ్యమో, మన కుటుంబం కూడా అంతే ముఖ్యం.

పాతిక సంవత్సరాలు ముందుకెళ్లి ఒక్క క్షణం ఆలోచిస్తే, 
మన పొజిషన్లో మన కొడుకో కూతురో ఉండి,
వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టయితే మన పరిస్థితేంటో కాస్త ఆలోచించుకోవాలి.

ప్రేమ చాలా గొప్పది. 
అలాంటి ప్రేమే మన తల్లిదండ్రులది కూడా.

ఇలాంటి ఆలోచనలు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే మన జీవితానికొక మంచి మార్గం దొరుకుతుంది.

ప్రతి రోజు మన రెండు రాష్ట్రాలలో చాల మంది ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అలా చేసుకున్నంత వరకే వారికి తెలుసు.
కానీ చేసుకున్నాక వారి కుటుంబం చవిచూస్తున్న నరకం, ప్రజలందరూ చూస్తున్నారు.

ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గం కాదు.


ఆలోచిద్దాం
ఒక్క క్షణం ఆలోచిద్దాం


మీ ఆలోచనలను కమెంట్ సెక్షన్లో తెలపండి.
స్ఫూర్తినిచ్చే రచన అని మీరు భావిస్తే, షేర్ చేసి మరింత మందికి చేరేలా చెయ్యండి

*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమనో బాధనో ఒకరికి కథ రూపంలో తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాను.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***
*** ***