జీవిత కథలు - 10



కథని అందించిన వారి కోరిక మేరకు, పేర్లు మార్చబడ్డాయి.

ప్రేమ ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అని ఒకరోజు ఒకబ్బాయి ఒక పెద్దాయన్ని అడిగాడంటా,  
పెద్దాయన ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో అంత మంది దగ్గరా ప్రేమ ఉంటుంది. 
అది ఎలా ఉంటుందనేది వారి, వారి జీవితాలని బట్టి ఉంటుంది అని సమాధానమిచ్చాడంట.

నిజమే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రేమను పొందుతాడు, చూపిస్తుంటాడు. 
అలాంటి ఎన్నో లక్షల కోట్ల ప్రేమకథలో ఇదొక కథ.

ఇక కథేంటో, పంపించిన వారి మాటల్లోనే చదువుదాం.

"నేను ఇంటర్లో ఉంటున్నప్పుడు నాకు అనుకోకుండా ఒక రాంగ్ నెంబర్లో పరిచయం అయ్యాడు హర్ష. తను అప్పటికే డిగ్రీ పూర్తి చేసాడు. అలా పరిచయమై, మంచి ఫ్రెండ్లా మాట్లాడేవాడు. నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టింది లేదు, నాతో ఎప్పుడు తప్పుగా మాట్లాడింది లేదు. నేను చాలా అల్లరి పిల్లని, ఆ వయస్సులో నాకేం తెలిసేది కాదు. కాలేజీలో చేసే అల్లరి మొత్తం సాయంత్రం తనతో పంచుకునేదానిని"

"కొన్ని నెలలు అలా సాగుతున్న మా పరిచయాన్ని, నా స్నేహితులు చెప్పిన మాటలు విడదీసాయి"

"మొహం తెలియని వ్యక్తితో మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించిన నా స్నేహితుల మాటలకి ఆలోచనలో పడిన నేను ఒకరోజు ఇంటికెళ్లి అతన్ని తిట్టి, మాట్లాడటం మానేసాను. నెంబర్ కూడా మార్చేసాను. తను బాధపడటం నాకు తెలిసింది, కానీ మా నాన్న చేస్తునట్టు మెసేజ్ చేసి, 
ఇంకొకసారి చెయ్యొద్దని తిట్టాను."

"3 సంవత్సరాలు తరువాత, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక కొత్త నెంబర్ నుండి మెసేజెస్ వచ్చేవి. ఎవరో తెలుసుకొనే క్రమంలోనే తెలిసింది హర్ష అని. 
ఆశ్చర్యం వేసింది 3 సంవత్సరాలైనా ఇంకా మర్చిపోకుండా చేస్తున్నాడేంటా అని. 
నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాను. నన్నింకా మర్చిపోలేదా? ఏంటిదంతా అని అడిగితే, దాని తన సమాధానం, నన్ను పెళ్లి చేసుకుంటానని తను చెప్పడం. 
అప్పటికే మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుందని ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్న సమయం. 
నాకెందుకో ధైర్యం చెయ్యాలనిపించలేదు.అందుకోసమే ఇంట్లో 
పరిస్థితంతా వివరించాను తనకి, ఇదంతా కుదరదని చెప్పటానికి ప్రయత్నించాను. 
కానీ అప్పటికే వాళ్ళింట్లో ఒప్పించి వాళ్ళ అమ్మ గారితో నన్ను మాట్లాడేలా చేసాడు"

"ఆమెతో కూడా, వద్దని చెప్పేసాను. చాలా సార్లు మాట్లాడి నచ్చచెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాడు, 
కానీ నేను తన గురించి అంతకు మించి ఆలోచించలేకపోయాను. 
కానీ తను నన్ను ఎంత ఇష్టపడ్డాడో నాకు తన మాటల్లోనే తెలిసేది"

"ఇన్నేళ్ళలో తను నన్ను చూసింది లేదు, నేను చూడలేదు. కలుద్దామని కూడా ఎప్పుడూ ఇద్దరం అనుకోలేదు. ఏం జరిగిందో నాకు తెలియదు, వాళ్ళ నాన్నగారికి వచ్చిన అనారోగ్యం కారణంగా, 
వాళ్ళ ఫామిలీ అంతా హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, 
ఆఖరికి నవంబర్ 2014 లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు.
అదే నాకు తను ఆఖరిగా కాల్ చెయ్యటం"

"అప్పటికే మా ఇంట్లో నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాకు పెళ్లి కూడా ఫిక్స్ అయింది.
ఆ సమయంలో ఇష్టమున్నా నేనేమి చెయ్యలేని స్థితిలో, ఇంట్లో వారికి చెప్పి వారిని బాధపెట్టడం ఇష్టంలేక, నా ప్రేమను నాలోనే చంపేసుకున్నాను" 

"nen emi cheyaleka kannavallani inka badha pettadam estam Leka na premani nalone champukunnanu.."

"ఆ తరువాత ఎలా ఉన్నదో కనుక్కోడానికి చాలా ప్రయత్నించాను. ఒకసారి చాలా నిరాశగా మాట్లాడాడు. హైదరాబాద్ వస్తాను కలుస్తావా అని మొదటిసారి అడిగాడు. పెళ్లైందని చెప్పేసరికి కాల్ కట్ చేసేసాడు"

"అప్పటినుండి తనని కలసి, కొత్త జీవితం మొదలుపెట్టామని చెపుదామని చాలా ప్రయత్నించాను. కాని, తను మాత్రం నీకు పెళ్లైపోయింది, ఇలా మాట్లాడుకోవడం మంచిది కాదు అని చెప్పి కట్ చేసేసాడు"

"తనకోసం చాలా వెతికాను. ఆఖరికి ఫేస్బుక్ లో దొరికాడు"

"అప్పుడు తన ఫొటోస్ చూసి, తనకి కూడా పెళ్ళయిపోయిందని తెలిసింది.
నాకు చాలా ఆనందంగా అనిపించింది"

"తన ప్రేమ నాకొక మంచి జ్ఞాపకం. లైఫ్ లాంగ్ గుర్తుంటాడు"

"thana prena nakoka Manchi gnapakam lyf long gurthuntadu.."

"అసలు మా బంధం ఏంటో నాక్కూడా సరిగ్గా తెలియదు. ప్రేమో స్నేహమో లేక మరెంటో.
కానీ నా మనసులో చాలా జ్ఞాపకాలు ఇప్పటికి ఉండిపోయాయి. ఎప్పటికి ఉంటాయేమో కూడా"

"నేను మంచిదాన్నో చెడ్డదాన్నో కూడా తెలియదు, కానీ తను మంచివాడు, తనని కలవకపోయినా తనమీద నాకున్న నమ్మకంతో చెప్పగలను"

"nen manchidanno kadhu thelidhu but thanu manchivadu thelikunda so cheppagalanu ante na nammakam"

"ఇప్పటికి 9 సంవత్సారాలు అవుతుంది తను పరిచయమై. తనని ఎప్పుడు కలవలేదు. కానీ మా మనసులు అలా మాట్లాడుకున్నాయి"

"...eppatiki 9 years avuthundi..thanu parichayam ai..thanani kalavaledhu ..but ma manasulu a la
matladukunnai"



*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమనో బాధనో ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాను.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***
*** ***

ప్రేమకు నిర్వచనం చెప్పిన నవల


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక