ప్రేమంటే ఏంటో చెప్పిన ముప్పై వాక్యాలు






ప్రేమంటే ఇది అని కచ్చితంగా చెప్పగలిగే కావ్యం లేదు... 
ప్రతి ఒక్కరికి తమ ప్రేమ చాలా పదిలం... 

ప్రేమంటే మీ మాటల్లో చెప్పండి అని అడిగిన ప్రశ్నకి ఇంత గొప్ప భావాలు నిజంగా ఆనందాన్నిస్తాయి...అందుకే వీలైనంత వరకు ఏది తప్పించకుండా పోస్ట్ చెయ్యటం జరిగింది. 

ఆచారి అందరివాడు:  జీవితం ఒక మలుపు గెలుపుల పందెమైతే, ప్రేమ అనే పతాకం కోసం పరిగెత్తే విజేతని నేను. 

రసమోని మూర్తి  :  మాటల్లో చెప్పలేని భావం ప్రేమ... మధురమైన జ్ఞాపకం ప్రేమ... ఒక మనసు ఇంకొక మనసుతో చేసే యుద్ధం ప్రేమ... నాలుగు కళ్ళ మధ్య జరిగే సంఘర్షణ ప్రేమ

ముకేశ్ పండు :  నిజమైన ప్రేమంటే ఏంటో తెలియని వాళ్ళు ప్రేమిస్తున్నారు... నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు... 

గండ్ల శ్రీరామ్ :  ప్రేమంటే రెండు కళ్ళ  వంటిది... కనులు వేరైనా... చూపు మాత్రం ఒక్కటే

శ్రీ శ్రీ :  ప్రేమంటే ఒకరిపై ఒకరికి నమ్మకం

ఉష రాణి :  మనుషులు వేరైనా మనసు, ఊపిరి ఒకటే

సతీష్ కుమార్ :  ప్రేమించిన వారిని మరణించిన వరకు సంతోషంగా చూసుకోవడం 

పోలకి ఉమా మహేశ్వరీ :  అమ్మ ఏమి మాట్లాడినా, ఏమి చేసినా అదే ప్రేమ

శ్రీకాంత్ రెడ్డి :   ప్రేమంటే ఏమిటో...  పలికితే పదం... అనుభవమైతే కావ్యం... ఆరాదిస్తే అజరామరం... ప్రేమంటే అమరం... ప్రేమంటే సత్యం
ప్రేమంటే నిత్యం 

నీహారిక అజ్జరపు :  కనపడదు కానీ నీడలా ఉండే భరోసా 

హేమలత గంట :  ఏ క్షణంలోనైనా ఒకరికోసం ఒకరు తోడుగా ఉండేదే ప్రేమ

సింధు రాశినేని :  మాటల్లో వ్యక్తపరచలేని భావం 

సిరి శ్రీ :  తియ్యని భాద 

రవి సారధి :  ప్రేమ యుద్ధం కాదు, ఒకరు బ్రతికి ఒకరు చనిపోవడానికి... ప్రేమ ఆట కాదు ఒకరు గెలిచి ఒకరు ఓడిపోవడానికి... ప్రేమంటే పండగ, ఇద్దరు కలసి జరుపుకునేది 

సంధ్య రెడ్డి ద్వారంపూడి : నువ్వే నేను, నీలో నేను, నాలో నువ్వు, వేరు కాదు మనం అన్న భావం. 

లక్ష్మి లవ్లీ దంగేటి :  ఒకరు మానసిచ్చి పట్టుకున్న చేతిని చచ్చేవరకు వదలకపోవడం 

లక్ష్మి గుండేటి :  ఒకరి పైన ఒకరు నమ్మకంతో జీవితాంతం కలసి ఉండాలి 

సాయి తేజ :  గమ్యాన్ని తెలిపేది ప్రేమ... అవసరమైతే ఏ గమ్యాన్ని చూపించకుండా వదిలేసేది ప్రేమ 

రంగం సాయి చరణ్ : ప్రేమ అనేది ఎవరు చెప్పలేరు... ఎందుకంటే ప్రేమ అనేది కళ్ళతో మొదలై మనసుతో ముగుస్తుంది  


మణికంఠ మను : ఒక తియ్యని గాయం 

దాసరి కిరణ్ కుమార్ :  ప్రేమంటే రెండు మనసుల కలయిక, అది మాత్రం జీవితంలో ఒకసారి వస్తుంది 

సునంద రెడ్డి : రెండక్షరాల పదమే కానీ... ప్రే.. ప్రేమించాక... మ.. మరువలేనిది 

ప్రసాద్ రాజు : అనిర్వచనీయమైన అనుభూతి 

రాజేష్ వెలమర్తి : విలువైనది ... నమ్మి విశ్వసించి చేసేది 

బుష్క కిశోర్ బాబు : ప్రేమ = ఇష్టం + అభిమానం 

నరసింహ రాజా శేఖర్ : రెండు హృదయాల ప్రేమ 

మోహన్ చిక్కం : వర్ణించలేని గొప్ప భావం 

ఇషా సారాహ్ : ప్రేమని వర్ణించడం చాలా కష్టం... ఈ విశ్వం మొత్తం నిండి ఉంది 

నరేష్ కుమార్ : అర్ధం లేనిదీ 

గాయత్రీ అజ్జరపు : నువ్వు నేను కలగలసి మనం అని నడిచే ఇరు హృదయాల స్పందన 

వెంకీ రాజు బోయ : ప్రేమంటే అందం చూసి ప్రేమించేది కాదు... రెండు హృదయాలు కలవాలి 



కమెంట్ చేసిన వీరందరికి ధన్యవాదాలు...