జీవిత కథలు - 7





జీవిత కావ్యం 


ప్రియమైన ప్రణయ,
థాంక్యూ ప్రణయ, 


మూడు సంవత్సరాల మన స్నేహం(స్నేహమేనేమో!) ఈరోజు ముగిసిపోయినందుకు. 

మన ప్రయాణం ఒక గమ్యాన్ని చేరినందుకు (ఆ గమ్యం ఏమైనా కానీ). 

చాలా జ్ఞాపకాలను ఇచ్చినందుకు. జీవితాంతం నాకొక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయినందుకు. 
                
నిజమే, మనమెంత ఇష్టపడుతున్నామో అవతల వాళ్ళు కూడా అంతే ఇష్టపడతారని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. 

నేను ఇష్టపడినంత మాత్రాన నువ్వు కూడా ఇష్టపడాలన్న రూలేం లేదు. 

నేనెప్పుడూ నీ చిరునవ్వుగానే ఉండాలనుకున్నా గాని, నీకొచ్చే కోపాన్ని అవ్వాలనుకోలేదు.

నువ్వెప్పుడు కోపంలో ఉన్నా, ఆ కోపంలో నన్నొక మాటన్నా... నిన్ను ఓదార్చె ప్రేమనవ్వాలనుకున్నానే తప్ప, నువ్వన్నావని మనసుకి ఎప్పుడు తీసుకోలేదు, కోప్పడలేదు. 

ఎందుకంటే కోపానికి కోపం సమాధానమైతే ఈ ప్రపంచంలో ఎన్నో బంధాలు క్షణాలలో తెగిపోయేవేమో.

కానీ ఆ కోపం ద్వేషంగా మారుతుందని తెలిసి ముందు బాధపడ్డాను. తరువాత ఆలోచించాను. ఒక నిర్ణయానికి వచ్చాను.

నువ్వెప్పుడూ అంటూ ఉంటావే, నాకు సహనం ఎక్కువని, ఆ సహనం నీ మీద ఉండే ఇష్టం వల్ల వచ్చినదేమో. కానీ ఈరోజు ఆ సహనానికే అసహనం తెప్పించేంత ద్వేషం నీకొచ్చిందని తెలిసి వెళ్ళిపోతున్నాను. 

నీకు దగ్గరగా, నువ్వు మొయ్యలేని భారంగా ఉండేకన్నా నీకు దూరంగా, ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోవాలనుకుంటున్నాను. 

మళ్ళీ చెపుతున్నా, నువ్వు జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా నేనొక చిరునవ్వుగానే గుర్తుకురావాలి. 



                                                                                                                              ఇట్లు
                                                                                                                              రాజీవ్ 


జీవితాంతం గుర్తుపెట్టుకునే కోపంలా ఉండే కన్నా, అప్పుడప్పుడు గుర్తుచేసుకొని ఆనందించే రూపంలా ఉండిపోవడం మంచిదేమో.


ఆధారం: అజ్ఞాత మెయిల్

మీ జీవితంలో జరిగిన కథలు గాని, మీరు తెలుసుకున్న కథలు గాని అందరితో పంచుకోవాలనుకుంటే... మీ కథని క్లుప్తంగా రాసి మాకు మెయిల్ చెయ్యగలరు.
మా మెయిల్ ఐడీ : santhakamofficial@gmail.com