ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఎందుకుంటాయి ?
ఈ కథ ఎప్పుడో క్రీస్తు పూర్వం 753, రోము దేశంలో మొదలైనది. అప్పటి రాజు రోములస్, పెరుగుతున్న అవసరాల రీత్యా క్యాలెండరు అవసరమని గుర్తించాడు. ప్రతి 29.5 రోజులకు చంద్రుని దిశ మారుతుందని గమనించి, పది నెలల లూనార్ క్యాలెండరుని తయ్యారుచేయించాడు. ఆ క్యాలెండర్లో మర్చి నెల నుండి డిసెంబర్ నెల వరకు కొన్ని నెలల్లో 30 రోజులు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండేలా చూసుకున్నారు.
మార్టీస్(మర్చి) -31
ఏప్రిలిస్(ఏప్రిల్) -30
మైస్(మే) -31
ఇయూనిస్(జూన్) -30
క్విటిలిన్(జులై) -31
సెక్సటైలిస్(ఆగష్టు) -30
సెప్టెంబర్ -30
అక్టోబర్ -31
నవంబర్ -30
డిసెంబర్ -30
డిసెంబర్ -30
తరువాతి రాజైన, నుమా పొంపిలుస్, ఈవెన్ నెంబర్ (సరి సంఖ్య) మంచిది కాదని, 30 రోజులున్న నెలల నుండి ఒక్కో రోజు తగ్గించుకుంటూ వచ్చాడు. అప్పుడు నెలలన్నీ విధముగా మార్పు చెయ్యబడ్డాయి.
మార్టీస్(మర్చి) -31
ఏప్రిలిస్(ఏప్రిల్) -29
మైస్(మే) -31
ఇయూనిస్(జూన్) -29
క్విటిలిన్(జులై) -31
సెక్సటైలిస్(ఆగష్టు) -29
సెక్సటైలిస్(ఆగష్టు) -29
సెప్టెంబర్ -29
అక్టోబర్ -31
నవంబర్ -29
డిసెంబర్ -29
డిసెంబర్ -29
కానీ ఈక్వినాక్స్(విషువత్తు),సోల్స్టిస్ (అయనాంతం) ల మధ్యదూరం 12 నెలలుగా గుర్తించి, చంద్రుని దిశ మార్చుకునే ఇంకొక రెండు నెలలను వీటికి కలపడం జరిగింది.
అప్పుడు ఒక ఏడాదికి రోజులు, 29.5 X 12 = 354 రోజులు
కానీ 354 అనేది ఒక ఈవెన్ నెంబర్(సరి సంఖ్య) కనుక దానినే, 355 చేసారు నుమా పొంపిలుస్. ఆ విధముగా ఈ నెలలు డిసెంబర్ తరువాతి నెలలుగా కలపబడ్డాయి.
జాన్సియారిస్(జనవరి) -29
ఫెబ్రవరీస్(ఫిబ్రవరి)-28
చాల ఏళ్ళు గడిచిన తరువాత, జూలియస్ సీజర్ అనే రోమన్ రాజు(క్రీ.శ 46), ఈజిప్టులో ఎక్కువ కాలం ఉండి, ఆ దేశ ప్రజలు ఉపయోగించే 365 రోజుల క్యాలెండరును అమలు చెయ్యటానికి నిశ్చయించుకున్నాడు. అంటే అప్పటి వరకు ఉన్న 355 రోజుల క్యాలెండర్లో పది నెలలకు ఒక్కోరోజు కలిపితే సరిపోతుందని, ఈ విధముగా క్యాలెండర్ను రూపొందించాడు. ఆ క్రమంలోనే జనవరి, ఫిబ్రవరి నెలలు మొదటి నెలలుగా నిర్ణయించడం జరిగింది. దీనినే సోలార్ క్యాలెండరు అని పిలవడం మొదలుపెట్టారు.
జాన్సియారిస్(జనవరి) -31
ఫెబ్రవరీస్(ఫిబ్రవరి)-28
మార్టీస్(మర్చి) -31
ఏప్రిలిస్(ఏప్రిల్) -30
మైస్(మే) -31
ఇయూనిస్(జూన్) -30
క్విటిలిన్(జులై) -31
సెక్సటైలిస్(ఆగష్టు) -31
సెప్టెంబర్ -30
అక్టోబర్ -31
నవంబర్ -30
డిసెంబర్ -31
కానీ ఒక ఏడాది, 365.25 రోజులుగా గుర్తించి ఫిబ్రవరి నెలకి, ప్రతి నాలుగేళ్లకు వచ్చే ఒక లీప్ డే ను జత చేయించాడు. అలా వచ్చినదే లీప్ ఇయర్.
ఆ రాజు పేరుతో పిలవబడేదే జులై నెల, తరువాతి రాజు ఆగస్తాస్ పేరుతో పిలవబడుతుంది ఆగష్టు నెల.
అప్పుడెప్పుడో అలా వచ్చిన 28రోజుల ఫిబ్రవరి ఇప్పటికి అలానే కొనసాగుతుంది.