జీవిత కథలు - 5


సలమా, నా భార్య ఒక చిన్న జ్యువలరీ వ్యాపారి. నేనొక రచయితని, గత ఆరు నెలలుగా ఫ్రీ లాన్సర్ గా(ఘోస్ట్ రైటర్ లా) పనిచేస్తున్నా. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనేదే నా కల. మా ఇద్దరికీ నెలసరి జీతాలిచ్చే ఉద్యోగాలు లేవు. 
సలమా బిజినెస్ మొదలుపెట్టి కేవలం ఒక్క ఏడాదే గడిచింది. యూనివర్సిటీ నుండి బ్రేక్ తీసుకోని, బిజినెస్ మీద ద్రుష్టి పెట్టడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తుంది. మా బంధువులోకాయన మమ్మల్ని ఎందుకింత రిస్క్ చేస్తున్నారని అడగగా, సలమా ఇచ్చిన సమాధానం నాకింకా గుర్తుంది,'మనమేం చేస్తున్నామో మనకి తెలిసి,ఇష్టమై చేస్తుంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ పని నుండి నిష్క్రమించకూడదు'. ఈ ఒక్క మాట నాలో వెయ్యేనుగులా బలం చేకూర్చింది. అది కూడా నా భార్య ద్వారా రావటం, ఆ బలం మరింత ఎక్కువైంది. 
సలమా, తన వ్యాపారం కేవలం 500 దిర్హామ్స్, ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో మొదలుపెట్టింది. రెండు జవెలెరీ పీసెస్ డిజైన్ చేసి, ఎవరైనా కొంటారా అనే భయంతో, ఆ ఫోటోలు పెట్టడానికే భయపడింది. తన మాటలే గుర్తొచ్చి, తనకి అండగా నిల్దాటానికి నిశ్చయించుకున్నాను. "నీకిష్టమైన పనిని వదలద్దు, నీకు బిజినెస్ చెయ్యటం ఇష్టం, జవెలెరీ డిజైన్ చెయ్యటం ఇష్టం, దీనిని ఎప్పుడు వదులుకోకు" అని కాస్త స్ఫూర్తిని నింపాను. 
కొన్ని రోజులకి నాకొక అవకాశం వచ్చి, ఇప్పుడు చేస్తున్న చిన్న ఉద్యోగం మానేయాల్సొచ్చింది. వచ్చిన అవకాశంలో కూడా పెద్దగా జీతమేమి లేదు, కానీ అది పెద్దదయ్యే ఛాన్స్ ఉంది. కానీ, కాస్తో కూస్తో జీతం ఇస్తున్న ఉద్యోగాన్ని వదిలి, ఇద్దరు కొడుకుల పోషణ భారం భరించలేనేమో అనిపించి వెనుకడుగేయడానికి సిద్ధపడ్డాను. కానీ అప్పుడు సలమా నాకిచ్చిన ధైర్యం, నాలో నూతన ఉత్తేజాన్ని నింపింది. "నీకు నచ్చింది చేసే అవకాశమొచ్చింది. నేనున్నా నీకు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకో"మని  తనిచ్చిన ధైర్యం నేనెప్పటికీ మరిచిపోలేనిది. 
"నేను ఓడిపోయి వస్తే? తరువాత కూడా ఇందులో డబ్బులు సంపాదించలేకపోతే?" అని నేనడిగిన ప్రశ్నకి తన సమాధానం, నా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసింది. "ఖాలిద్, నీకు ఒక మంచి అవకాశం కావలి, ఇప్పుడొచ్చిన అవకాశం నీకు ఉన్నపళంగా డబ్బుని ఇవ్వకపోవచ్చు, కానీ నీకు సంతృప్తినిస్తుంది. నీలో ఆత్మ విశ్వాసం పెంచుతుంది. నువ్వు మమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టవనే నమ్మకం కూడా నాకుంది" 
ఇప్పుడు ఒక ఏడాది కలం తరువాత, మా ఇద్దరం మాకు నచ్చిన పనులు చేస్తూ, జీవితాన్ని గడిపేస్తున్నాం. ఛాన్స్ తీసుకోడానికి ఆ రోజు పడిన భయం, మాలో ఇంత మార్పుని తీసుకొస్తుందని ఎప్పుడు ఊహించలేదు. 
భార్యంటే కష్టపెట్టేది అని అనుకునే ఎంతో మంది భర్తలకు, అలానే భర్త కోసం నచ్చినవాన్నీ వదులుకోవాలి అని అనుకునే భార్యలకు, భార్యంటే కష్టాల్లో తోడుండేది, భర్తంటే మనకి నచ్చినవి సాధించేలా చేసేవాడు అని నిరూపించిన ఈ జంట, ఇంకెంన్నో జంటలకు స్ఫూర్తిదాయకం. 


సోర్స్: The Logical Indian



మీ జీవితంలో జరిగిన కథలు గాని, మీరు తెలుసుకున్న కథలు గాని అందరితో పంచుకోవాలనుకుంటే... మీ కథని క్లుప్తంగా రాసి మాకు మెయిల్ చెయ్యగలరు.
మా మెయిల్ ఐడీ : santhakamofficial@gmail.com