మరో స్వతంత్ర పోరాటం




నీవొక్కడివే నడిచొస్తూ 
నేనొక్కడినే అనుకోకూ 
నీకోసం ఎదురుచూస్తూ 
దేశముందని మర్చిపోకు 


విశ్వాసంతో చేయి కలుపుతూ 
విజయాకాంక్షతొ ముందడుగేస్తూ 
వేయి గొంతులూ లక్షలు అయితే 
లక్ష్యమన్నదే మనదే కాదా 


వంద క్రోసులా, దూర ప్రయాణం 
మొదలైనది మొదటడుగుతొ కాదా 
అడుగుతో అడుగు తోడే పడగా
సుదూర గమ్యం, చేరువ కాదా 



ఇస్తామన్నది కాదన్నప్పుడు 
కదం తొక్కి పోరాడాలంతే 
కష్టం, నష్టం ఆలోచిస్తూ 
కన్నీరెందుకు బ్రతకాలంటే


నీవే దైర్యం, నీవే సైన్యం 
నీకొచ్చిన రాత్రికి, నీవే ఉదయం
నీవే పవనం, నీవే వర్షం 
నీ విజృంభణ ఆపుట ఎవరి తరం
నీదే సమరం, నీదే విజయం 
నీ నెత్తుటికష్టం దేశాభ్యుదయం