జీవిత కథలు - 1



నేనొక టీచర్ ని, జీవిత పాటలు బోధించే నా జీవితంలో జరిగిన అతిపెద్ద పాఠం ఇది. 

అప్పుడే ఒక క్లాస్ టీచ్ చేసి లైబ్రరీరూంకి వచ్చాను. తరువాతి క్లాసుకి ఇంకొక పది నిమిషాల వ్యవధి ఉండటంతో, ఒక పుస్తకం అవసరమై అదే ఫ్లోర్ లో ఉన్న చిన్న లైబ్రరీరూంకి వెళ్ళాను. అక్కడ ఉండాల్సిన లైబ్రేరియన్ లేరు. రూమంతా ఖాళీగా ఉంది. అంతా  నిశ్శబ్దం. లోనికి వెళ్లి పుస్తకం కోసం వెతుకుతుండగా ప్యాంటు ప్యాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. కానీ క్లాసుకి లేట్ అవుతుండడంతో, ఫోన్ గురించి పట్టించుకోకుండా, పాకెట్లో అలానే వదిలేసి పుస్తకం దొరకడంతో బయటకి వచ్చేసాను. అలానే వస్తూ వస్తూ, ఆ పక్క రూం ముందు నుండి నడుస్తుండగా, నా తోటి ఉపాధ్యాయులందరూ ఆ రూంలో ఉన్న టీవీ తీక్షణంగా చూడటం గమనించాను. 

ఎప్పుడూ ఇలా అందరూ టీవీ చూస్తూ ఉండటం నేను చూసింది లేదు. ఏమై ఉంటుందో తెలుసుకుందామని ఆ టీవీ వైపు వెళ్ళాను. టీవీ చూసేసరికి ఒక్క సారి నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏదో పెద్ద భవంతి, మంటల్లో కాలిపోతుంది. దాని చుట్టూ దట్టమైన పొగ, కాస్త కింద చూసేసరికి అది న్యూయార్క్ లో గల వరల్డ్ ట్రేడ్ సెంటర్. నా కాళ్ళు ఆడటం ఆగిపోయాయి, గుండెంతా బరువెక్కిపోయి, శ్వాస కష్టమైపోయింది. చూపు మందగించింది. ఒళ్ళంతా చెమటలు. వెంటనే ఫోన్ తీసి చూసేసరికి, మా అయన నుండి వచ్చిన మిస్డ్ కాల్ ఉంది. ఇంకా అలానే టీవీ వంక చూస్తూనే, పక్కనున్న వాళ్ళని ఎం జరిగిందని అడిగాను, చూస్తున్నది నమ్మే స్థితిలో లేని నేను వాళ్ళు చెప్తున్నప్పుడు నమ్మకం దృఢమైంది. అవును, అది వరల్డ్ ట్రేడ్ సెంటరే. 

వెంటనే ఫోన్ తీసి మా ఆయనకి కాల్ చెయ్యటం మొదలుపెట్టాను. కానీ కాల్ కలవలేదు. అదే బిల్డింగ్లో మీటింగ్ ఉందని ముందు రోజు రాత్రి ఫ్లైట్లో వెళ్లిన మా అయన ఫోన్ కలవడంలేదు.  చేస్తూనే ఉన్నాను, కానీ కలిసింది లేదు. నా జీవితంలో ఆ రెండు నిముషాలు ఎప్పటికి మర్చిపోలేనివి, ఒక పుస్తకం కోసమని ఫోన్ కాల్ చూసుకొని నేను, ఆ తరువాత మా ఆయనతో మాట్లాడింది లేదు. ఆ ఫోన్ కాల్ మాట్లాడివుంటే నా జీవితం వేరేలా ఉండేదేమో. ఈ సంఘటన జరిగి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ సందర్భం మాత్రం నా నుండి వదిలి వెళ్లటంలేదు. 

నా పేరు నికోలే టెంప్స్కె. 


తాము చేయని పాపానికి, ఇలా భర్తల్ని కోల్పోయిన భార్యలు, భార్యల్ని కోల్పోయిన భర్తలు ఎందరో. ఉగ్రవాదం అనే ఒక్క పదం ఎంతో మంది అమాయకులిని తమ కుటుంబాల నుండి దూరం చేసింది. ఎన్నో కుటుంబాలను అనాథలను చేసింది.

ఉనికి చాటుకునే దాడులు కొన్ని, 
మతోన్మాదంతో చేసిన దాడులు కొన్ని, 
ఆవేశంలో చేసినవి కొన్ని, 
అత్యాశతో చేసినవి కొన్ని... 

ఇలా కారణం ఏదైనా ప్రాణాలు కోల్పోతున్నది, అమాయకులైన ప్రజలు.

ఈ మారణహోమానికి ముగింపు ఎప్పుడు అనే ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. 




ఆధారం : quora



మీ జీవితంలో జరిగిన కథలు గాని, మీరు తెలుసుకున్న కథలు గాని అందరితో పంచుకోవాలనుకుంటే... మీ కథని క్లుప్తంగా రాసి మాకు మెయిల్ చెయ్యగలరు.
మా మెయిల్ ఐడీ : santhakamofficial@gmail.com