జీవిత కథలు - 4





ఈ సంఘటన జరిగి కొన్ని గంటలే అయింది. బరోడాలో ఉన్న ఒక మార్కెట్లో ఒక తాళం కొనటానికాని నా కజిన్ తో కలసి వెళ్ళాను. ఒక షాప్ దగ్గర ఆగి అక్కడున్న వెరైటీస్ చూస్తుండగా, ఆ మూలనున్న తాళం అమ్మకి అవసరమవుతుందని తీసుకోమన్నాడు నా కజిన్. 
అది తీసుకోని డబ్బులిస్తుండగా, ఆ షాప్ యజమాని డబ్బులు తీసుకోడానికి నిరాకరించాడు. 
ఎందుకని మేము ప్రశ్నించగా, ఆయన చెప్పిన మాటలు నాలో ధృడంగా నాటుకుపోయాయి. 
"నేను,గుడికి మజీదుకి కొనే తాళాలకి డబ్బులు తీసుకోని బాబు", ఆయనలా చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నమిద్దరం. 
"ఈరోజు ఉదయమే, ఈ పక్కనే ఉన్న గుడికోసం 12 తాళాలు తీసుకోని వెళ్లారు, నేనొక్క రూపాయి కూడా తీసుకోలేదు"
ఇంతలో, ఆ పక్క షాప్ యజమాని వచ్చి, "ఆరిఫ్ భాయ్, గుడికి మజీదుకి కొన్న తాళాలకి డబ్బులు ఎప్పుడు తీసుకోదు బాబు" అని చెప్తుంటే, నాకు చాల ఆశ్చర్యంగా అనిపించింది. 
ఇంతలో ఆరిఫ్ భాయ్,"దేవుడు ఒక్కడే, మనమందరం అయన భక్తులం. మతం మత్తులో చాల మంది కొట్టుకు చేస్తున్నారు, కానీ మనమందరం కలిసే బ్రతకాలి"
నిజమే, 
మతం గొప్పదా మానవత్వం గొప్పదా అంటే ?
కొన్ని సార్లు మన అనుకునే వారిని కూడా దూరం చేసేది మతం, ఏ మనిషినైనా నీకు దగ్గర చేసేది మానవత్వం. 
సోర్స్: The Logical Indian





మీ జీవితంలో జరిగిన కథలు గాని, మీరు తెలుసుకున్న కథలు గాని అందరితో పంచుకోవాలనుకుంటే... మీ కథని క్లుప్తంగా రాసి మాకు మెయిల్ చెయ్యగలరు.
మా మెయిల్ ఐడీ : santhakamofficial@gmail.com