నువ్వేం చేస్తావురా ? నువ్వేం సాధిస్తావు రా?


అరే... అరే... బామ్మర్ది 
నువ్వేం చేస్తావురా ?
నువ్వేం సాధిస్తావు రా?


కంప్యూటరు ముందు కూర్చున్నోడివి
కదలిక ఎట్లా తీసుకొస్తావురా ?
ఏసీ రూంలో బ్రతికేవాడివి 
ఏపీ భవిష్యత్తేలా మార్చుతావురా ?


అమ్మాయిలెంబడి తిరిగేవాడివి 
అధిష్ఠానన్నేం అడుగుతావురా ?
పూర్తిగా పాతికేళ్ళు నిండనోడివి 
పాలనోల్లనేం ప్రశ్నిస్తావురా ?

బైకులన్నా, కారులన్నా మురిసిపోయే నువ్వు 
భాషకున్న గౌరవాన్ని నిలబెడతావా రా ?
జ్వరం చేస్తే జడిసిపోయినోడివి
జనం కొరకు, జయం కోసం పోరాడతావా రా ?


'ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన 
సోమరులారా చావండి 
నెత్తురు మండే, శక్తులు నిండే 
సైనికులారా రారండి'
అన్నాడొక మహాత్ముడు 


యువకుడంటే పాతికేళ్ల ఆవేశం కాదు 
మార్పులు తీసుకొచ్చే ఆలోచన కూడా 
కష్టమొస్తే పారిపోయే వ్యక్తి కాదు 
కయ్యమంటే, కదలి వచ్చే శక్తి కూడా 

రండి, నిరూపిద్దాం 
మన గొంతు వినిపిద్దాం
మన హక్కుని సాధిద్దాం 


నీ మిత్రులతో రా, కత్తులతో కాదు
ఒక అజెండాతో రా, పార్టీ జెండా మోస్తూ కాదు