ఎదురుచూపులు



కాలం కరిగిపోయింది... హృదయం పగిలిపోయింది
నీవొస్తావని ఎదురుచూసి
సమయం మించిపోయింది... ఆనందం తెంచి పోయింది 
నీవొస్తావని ఎదురుచూసి
సహనం వీడిపోయింది... పదిలం కదిలిపోయింది 
నీవొస్తావని ఎదురుచూసి
పాదం దారి తప్పింది... నా మది గాడి తప్పింది 
నీవొస్తావని ఎదురుచూసి
మన మిధునం మాసిపోయింది... ఈ అంశం శ్వాస వీడింది 
నీవొస్తావని ఎదురుచూసి


సూర్యుని ఉదయింపునకు ఎదురుచూసే పడమరలా 

చంద్రుని కాంతికై ఎదురుచూసే అమావాస్యలా 
నిన్నటికై ఎదురుచూసే నేటిలా 
నేటికై ఎదురుచూసే రేపటిలా  


నా అర్ధంలేని ఎదురుచూపులు నీకోసం ఎదురుచూస్తూనే ఉంటాయి