శశివదనం - 3




అప్పటివరకూ నా మనసులోని మాటకు తననుంచి ఎటువంటి సమాధానం లేదు అందుకని ఏం చెయ్యాలో తెలియక నార్మల్ గా ఎప్పటిలానే ఆరోజు కూడా కలిసాము. తనకి చాక్లెట్స్ అంటే పిచ్చి. ఎంత పిచ్చంటే అప్పుడప్పుడు సరదాగా అంటూ ఉంటుంది చాక్లెట్ ఫ్యాక్టరీ ఉండేవాడిని పెళ్ళి చేసుకుంటే ఎప్పుడు నచ్చితే అప్పుడు ఫ్రీగా చాక్లేట్స్ తినచ్చని . అందుకే తనకి ఎంతగానో ఇష్టమైన డైరీమిల్క్ ఫ్లేవర్లో వాలెంటైన్స్ డే స్పెషల్ "డైరీమిల్క్ సిల్క్"ని తెప్పించాను . అవి తీసుకుని వెళ్ళాను కానీ ఇవ్వాలా ? వద్దా ?అని ఆలోచిస్తున్న నాకు తను ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది.

అది ఏంటంటే...

అప్పటివరకూ మేం చాలాసార్లు కలిసాం, కానీ మేమెప్పుడూ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు.
మాకు ఉన్నవి ఙ్ఞాపకాలు మాత్రమే. ఆ రోజు నేను ప్రపోజ్ చేస్తూ చెప్పిన మెమోరిబుల్ మూమెంట్స్ అన్ని పెన్సిల్ స్కెచ్ రూూపంలో నాకు ఇచ్చింది. అవి చూస్తూ నాకు ఒక్కక్షణం ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు . కళ్లల్లో నీళ్ళు, ముఖంలో చిరునవ్వు, గుండెల్లో ఆనందం ...
అలా వాటిని చూస్తూ ఉండిపోయాను.

అప్పుడు చెప్పింది తను, "ఐ లవ్ యూ లక్కీ . ఈ మాట కోసం నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావో ! చెప్పే సమయం కోసం నేను అంతే ఎదురు చూస్తున్నాను. నువ్వు ప్రపోజ్ చేసిన రోజు చెప్పిన మాటలు అన్నీ, రోజూ నేను నీకు చెప్పలేక , నాలో నేను. నాతో నేను చెప్పుకునే మాటలు. ఆ రోజు నువ్వు చెబుతుంటే, చాలా హ్యాపీగా అనిపించింది లక్కీ. నువ్వు ఆ రోజు మనం కలిసిన మెమోరిబుల్ మూమెంట్స్ అన్ని చెప్పావు, కాని నాకు నీతో ఉండే ప్రతీరోజు ఒక మెమోరిబుల్ మూమెంట్. ఫస్ట్ టైం నువ్వు నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేదు. కానీ తర్వాత మనం చాలాసార్లు కలిసినా, ఏ రోజు కూడా నేను ఇబ్బంది పడతానేమో అని ఆ విషయం గురించి అడగలేదు అప్పుడే నువ్వంటే ఇష్టం కలిగింది. నాకు నువ్వంటే ఇష్టం వుందని తెలిసి కూడా ఎప్పుడూ తప్పగా ప్రవర్తించలేదు. నాకు అందంగా చెప్పడం రాదు లక్కీ, నీతో వుంటే హ్యాపీగా ఉంటుంది. లైఫ్ లాంగ్ అలాగే ఉండాలని వుంది. ఇప్పుడు అడుగుతున్నా లైఫ్ లాంగ్ నాకు తోడుగా ఉంటావా ?" అని తన చేయి చాచి నా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.

"తనని గట్టిగా హగ్ చేసుకుని, తన చెయ్యి పట్టుకుని, ఈ చెయ్యి నా ప్రాణం ఉన్నంత వరకు వదలను" అని చెప్పి తన నుదిటిపైన ముద్దు పెట్టాను. అదే మొదటిసారి తనని ముద్దు పెట్టుకోవడం.
ఆరోజు ని లైఫ్ లో మర్చిపోలేను. నా మనసులో మాటకి సమాధానం దొరుకుతుందనుకున్న నేను, తను నా మీద అమితంగా పెంచుకున్న ప్రేమని తెలుసుకున్నాను.
ఇంతలా ప్రేమిస్తారా అనిపించింది.

తర్వాత తనని సాహితీకి ఫోన్లో పరిచయం చేసాను.అప్పటికే నేను ప్రతీ విషయం తనకి చెబుతాను కాబట్టి సాహితీ, శశితో చాలా ఫ్రీగా మాట్లాడింది.

కొన్ని రోజుల తర్వాత సాహితీ మా ఇద్దరికీ "తన పరిచయం" నవల గురించి చెప్పింది చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని, కొంచెం మీ స్టోరీలా కూడా ఉంటుందని చెప్పింది. తర్వాత మేం కూడా ఆ ఎపీసోడ్స్ అన్ని చదివాముు . నిజంగా ప్రతీ ఏపిసోడ్లో ఏదో ఒక సీన్ మా స్టోరీకి కనెక్ట్ అయ్యేది. "తన పరిచయం" నవల వల్ల చాలా విషయాలు గుర్తుకు వచ్చాయి. మా ఙ్ఞాపకాలన్ని మళ్ళీ మాకు గుర్తు చేసింది అప్పటినుంచి ప్రతీ శుక్రరవారం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురు చూసేవాళ్ళం.

ఇలా చాలా హ్యాపీగా సాగుతున్న టైం లో చిన్న గొడవ

29 ఏప్రిల్ 2017

తనకి జనరల్ గా ఒక హాబీ ఉంది. తన ఫ్రెండ్స్ లో ఎవరిదైనా వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ నచ్చినా, స్టాటస్ నచ్చినా అవి సేవ్ చేసుకుని కామెంట్స్ ని పర్సనల్ గా మెసేజ్ చేస్తుంది. అలాగే కాలేజ్లో తన ఫ్రెండ్ ఒక అబ్బాయికి మెసేజ్ చేసింది. దానికి నేను కొంచెం జలస్ ఫీల్ అయ్యి క్వశ్చన్ చేసాను.

"పిక్ నచ్చితే లైక్ చేసి వదిలెయచ్చు కదా ?పర్సనల్ గా మెసేజ్ చెయ్యడం ఎందుకు ?అది కూడా నువ్వే ఫస్ట్ స్టార్ట్ చెయ్యడం ఎందుకు? నార్మల్ గా ఎప్పుడైనా ఛాట్ చేస్తే చెప్పచ్చు కదా? స్పెషల్ గా మెసేజ్ చెయ్యటం ఎందుకు?" అని అడిగాను.

నిజానికి తను చేసినదాంట్లో తప్పేం లేదు. ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటుంది. అలాగే పిక్ ని లైక్ చేసిన విషయం కూడా తనే నాతో చెప్పింది. నేను జలస్ ఫీల్ అయ్యి నువ్వు లైక్ చేస్తే చేసుకో కాని ఆ విషయం నాకు చెప్పకు అని కోపంగా అనేశాను.

అప్పుడు తను అన్న ఒక మాట నేను ఎప్పటికి మర్చిపోలేను, "నేను ఏ విషయమైనా నీతో షేర్ చేసుకుంటాను లక్కీ. దానివలన నువ్వు బాధపడతావంటే నేను నా హాబీ ని మార్చుకుంటానే గానీ నీతో షేర్ చేసుకోకుండా ఉండలేను లక్కీ"
దానికి నేను, "అవసరం లేదు. నా కోసం నువ్వు నీ హాబీ ని ఎందుకు మార్చుకోవడం
నువ్వు నీలానే ఉండు" అని ఒక మాట విసిరేసాను. 
దానికి తను, "నేను నాలా ఉండటం అంటే నీకు నచ్చేలా ఉండటం అప్పుడే నేను నాలా ఉన్నట్టు
ఆ మాట వినగానే నేను ఎంత చీప్ గా బిహేవ్ చేసానో అర్ధమయ్యింది. నన్ను అంతలా ప్రేమించి, అంతలా అర్ధం చేసుకునే అమ్మాయిని ఎంత బాధపెట్టానో అర్ధమయ్యింది.

ఇప్పుడు చెబుతున్నా శశి,

నువ్వు పలికిన మాటలలో అమ్మనై నీ తొలి పిలుపు నేనవుతా...
అనుక్షణం నీ మంచిని కోరే నాన్ననై నీకు చేయూతగా ఉంటా ...
నీ కష్ట సుఖాలలో ఒక స్నేహాన్నై నీ వెంట ఉంటా..
నువ్వు కోరుకునే హృదయానికి రూపాన్ని నేనై నీకు జీవితాంతం తోడుగా ఉంటా.....

సత్య ❤ శశి


లవ్ యూ ఫర్ ఎవర్

*** ***

ఈ కథ సంతకం పాఠకులలో ఒకరికి జరిగిన కథ, తన పప్రియురాలి జన్మదిన శుభాకాంక్షలు ఈ విధంగా చెప్పాలనుకున్న తన సృజనాత్మకతకు నేను ముగ్ధుడినైపోయాను. 

మరొక్క సారి 

జన్మదిన శుభాకాంక్షలు 

*** ***
పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 



*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.

*** ***