శశివదనం -1



ప్రేమ
రెండు అక్షరాల చాలా చిన్నమాట !
కాని ‌‍‌‌‌‌‌‌‌ఎటువంటి సందర్భంలోనయినా ఆ మాట మన పెదవులపై ఒక కమ్మని కావ్యంలా పలుకుతుంది.

అమ్మాయి ప్రతీ మాటని ఇష్టపడే అబ్బాయి

అబ్బాయి ఇష్టాన్నే తన ఇష్టంగా మార్చుకునే అమ్మాయి
వీరి ఇద్దరి మద్య జరిగిన ఒక చిన్న ప్రేమకథ

శశివదనం
ప్రతీ ఒక్కరూ తన జీవితంలో ఎవరినో ఒకరిని ఇష్టపడతారు.
వారితో తన జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతారు.
అలాగే నేను కూడా మా మావయ్య గారి అమ్మాయిని ఇష్టపడ్డాను.
చుట్టాలమ్మాయి అవడం వలన పరిచయానికి పెద్దగా ప్రోబ్లమ్ రాలేదు కలుసుకోవడానికి, మాట్లడటానికి కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. కాని నా ఇష్టాన్ని ఇంట్లో చెప్పే ధైర్యం లేకపోవటం వలనో లేదా ఆ సమయానికి నాకు సరైన ఉద్యోగం లేదని భయం వలనో కానీ నా ఇష్టాన్ని పెళ్ళి వరకూ తీసుకుని వెళ్లలేకపోయాను. ఇంతలో తనకి పెళ్ళి అయిపోయింది.
ఒక సంవత్సరకాలం తర్వాత

ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్.
జాబ్ కోసమని ఉన్న ఊరు నుంచి విజయనగరం షిఫ్ట్ అయ్యాము.
కొత్త ఊరు, కొత్తగా పరిచయమైన స్నేహితులు , రోజూ "9 టూ 6" జాబ్, సాయంత్రం స్నేహితులతో సరదా కబుర్లు, ఇలా సాదా సీదాగా లైైఫ్ గడిచిపోతోంది. ఇంతలో వినాయకచవితి సంబరాలు మొదలయ్యాయి...
చుట్టుపక్కల అందరూ ఎంప్లోయిస్ అవడం వలన చాలా గ్రాండ్ గా చేస్తున్నారు.
రోజుకొక ఈవెంట్, గేమ్స్ ఇలా సరదాగా సాగిపోతోంది
19 సెప్టెంబర్ 2015 : ఆ రోజు వెయ్యి దీపాలతో దీపారాధన కార్యక్రమం పెట్టారు. ఆ రోజే తనని ఫస్ట్ టైం చూసాను, పింక్ &వైట్ చుడీదార్. దీపాల కాంతులలో చంద్రబింబం లాంటితన ముఖం.
అందర్నీ ఆప్యాయంగా పలకరించే తన చిరునవ్వు.

ఈ విషయం సాహితీ కి ఫోన్ చేసి చెప్పాను.
సాహితీ మా పిన్ని గారి అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసి క్యాంపస్ సెలక్షన్స్ లో ఐబియమ్ లో జాబ్ వచ్చి బెంగుళూర్ లో ట్రైనింగ్ లో ఉంది. నేను నా ప్రతీ విషయం తనతో షేర్ చేసుకుంటాను. పాపం నేను చెప్పే సోదంతా చాలా ఓపికగా వింటుంది. గాలికి దీపాలు ఎక్కడ ఆరిపోతాయో అని భయంగా, అమాయకంగా చూసే తన చూపు, చాలా చాలా అందంగా అనిపించింది. కాని నేనేదో పనిలో ఉండగా తనెప్పుడు వెళిపోయిందో తెలియదు తర్వాత మరి కనిపించలేదు.
ఆ రోజు తీసిన ఫోటోస్ ద్వారా తను కూడా మా కోలనీ అని తెలుసుకున్నాను.
పేరు: శశి ఇంజనీరింగ్ చదువుతోంది 5 సెప్టెంబర్ 2016 మళ్ళీ శశిని చూడటానికి సంవత్సర కాలం పట్టింది. తరువాతి సంవత్సరం వినాయకచవితి సంబరాలలో. కొన్ని రోజుల తర్వాత తన ఫోన్ నంబర్ తెలుసుకుని తనకి " హాయ్ " అని మెసేజ్ చేసాను వాట్సాప్ లో బ్లూ టిక్స్ ద్వారా తను ఆ మెసేజ్ ని చూసిందని అర్ధమైంది. కాని రిప్లై రాలేదు. మళ్ళీ రాత్రికి గుడ్ నైట్ అని మెసేజ్ చేసాను, అయినా రిప్లై రాలేదు. ఇక నేను మెసేజ్ చెయ్యడం మానేసాను.

ప్రతీరోజు తనని చూసేవాడిని కాని ఏ రోజు కూడా తనతో మాట్లాడలేదు. కోలనీలో తనకిి నేను, నాకు తను తెలుసు అంతే ! ఈ సంవత్సర కాలం తనకోసం చాలా ఎదురు చూసాను. రెండు రోజులు తర్వాత నేను ఆఫీస్ కి వెళ్ళే టైం. తను కూడా కాలేజ్ కి వెళ్తోంది. ఆటో రాకపోవటం వల్ల రోడ్ వరకూ నడచి వెళ్తోంది. ఇద్దరం అనుకోకుండా కలిసాం కాని ఎందుకు మెసేజ్ చేసావని తనూ అడగలేదు, రిప్లై ఎందుకు ఇవ్వలేదని నేను అడగలేదు. నార్మల్ గా మాట్లాడుకుంటూ రోడ్ వరకూ వెళ్ళి, ఓకే... బై... అని చెప్పి వేరే ఆటోలో తను కాలేజ్ కి వెళ్ళిపోయింది.

నెక్స్ట్ డే తననుంచి మెసేజ్ 'హాయ్' అని . తననుంచి మెసేజ్ చూడగానే చెప్పలేని ఆనందం.
నేను వెంటనే రిప్లై ఇచ్చాను

'హలో' 'వాట్ డూయింగ్' 'నత్తింగ్'
ఇలా కాసేపు మా మాటల కొనసాగాయి. ఇక ఆ రోజు నుంచి ప్రతీరోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ తో స్టార్ట్ అయిన మా పరిచయం ప్రతీ విషయం షేర్ చేసుకునేంతగా మారింది.
ఒకరోజు ఇద్దరం కలుద్దామనుకున్నాం.
27 నవంబర్ 2016: టేస్టీబర్డ్స్ రెస్టారెంట్
సమయం సాయంత్రం 4:00
ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీం, మిల్క్ షేక్ లా కరిగిపోయింది గాని మా ఇద్దరి మధ్య మౌనం మాత్రం వీడలేదు.

ఫైనల్లీ తనే మాట్లాడింది, "చూడు టెన్షన్ తో నా చేతులు ఎంత చల్లగా అయిపోయాయో" అంటూ ఏదో మాట కదిపింది.

అసలే ఏం మాట్లాడాలో తెలియని నాకు, తన టెన్షన్ చూసి నాలో మరింత కంగారు పెరిగింది,
చిన్నగా నవ్వి ఊరుకున్నా.
"సరేగానీ! ఎవరినైనా లవ్ చేసావా?" అంటూ ఏదో టాపిక్ స్టార్ట్ చేసింది.
"అదేంటి అలా అడిగావ్?" తను ఒక్కసారి అలా అడిగేసరికి ఏదో తెలియని ఆశ్చర్యం నాలో. "ఏదో అడిగేసాను కదా. చెప్పు" అంటూ చాలా కాన్ఫిడెంట్ గా బదులిచ్చింది.
"మా మావయ్యగారి అమ్మాయిని" "మరెమయ్యింది?" తెలుసుకోవాలనే ఆత్రుత కనిపించింది తనలో. "తనకి పెళ్ళి అయింది" దీర్ఘంగా సాగదీస్తూ చెప్పాను. "అదేంటి?" ఒక్కసారి కంగుతిన్నంత ఆశ్చర్యం. "చేప్పుకునేంత గొప్ప స్టోరీ ఏం కాదులే! ఏదో అలా అయిపోయింది" "సరే సరేలే ! ఇంకేంటి" అంటూ కొంతసేపు మాట్లాడుకున్నామ్.
తన చిన్నప్పటి విషయాలు, కాలేజ్ సరదా కబుర్లు చెబుతూ నవ్వుతూ ఉంటే,
అలా తనని చూస్తూ ఉండిపోవాలనిపించింది.
మనసులో ఏదో తెలియని ఆనందం.
ఆ మాటల మద్యలోనే, "రేపు నాతో బయటకి వస్తావా" అని అడిగాను . "ఎక్కడికి?" అంటూ ఆశ్చర్యంగా అడిగింది.
"ఏమో తెలియదు. నువ్వు వస్తావా?"
"రేపు కాలేజ్ ఉంది. అయినా ఎవరైనా చూస్తే?"

తనలా అనగానే రావడానికి ఇష్టం ఉన్నా, ఎవరైనా చూస్తారనే భయం తనని ఆపేస్తోందని నాకు అర్ధమయింది. ఆఖరికి చూద్దాం అని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత రోజు :
ఎవరైనా చూస్తారనే భయంతోనే నాతో బయటికి వచ్చింది.
తన భయం పోగొడదామని "బైక్ డ్రైవ్ చేస్తావా"అని అడిగాను. "వాట్ !" నేనలా అడిగేసరికి ఆశ్చర్యం తనలో, "ఏమంటున్నావ్ ?" "బైక్ డ్రైవ్ చేస్తావా" మళ్ళీ అదే అడిగాను. "నేనా ! ఆహా వద్దు" "పర్లేదు. నేను నేర్పిస్తా" అనగానే, నవ్వుతూ "సరే" అంటూ బైక్ స్టార్ట్ చేసింది.

మొదట్లో కొద్దిగా భయపడినా స్కూటీ అలవాటు ఉండటంతో బాగానే డ్రైవ్ చేసింది.

విజయనగరం టూ వైజాగ్ హైవే రోడ్ .

అప్పటి వరకూ భయంభయంగా, స్లోగా డ్రైవ్ చేసిన తను ఒక్కసారిగా స్పీడ్ పెంచింది.

"ఓయ్. ఎందుకంత స్పీడ్?" స్కూటీ డ్రైవ్ చెయ్యను అన్న పిల్ల అంత స్పీడ్ గా వెళ్తున్నందుకు చాల కంగారు మొదలైంది నాలో.
"ఆం. మీ అబ్బాయిలంతా చేతిలో బైక్ ఉంటే స్పీడ్ గా వెళ్తూ ఫోజులు కొడతారు కదా, అసలు ఏముందో ఆ స్పీడ్ లో చూద్దాం అని" అంటూనే ఇంకా వేగం పెంచింది.

అంతలోనే...

రెండవ పార్ట్





*** ***
పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 



*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.

*** ***