శశివదనం - 2

మొదటి పార్ట్
విజయనగరం టూ వైజాగ్ హైవే రోడ్ .

అప్పటి వరకూ భయంభయంగా, స్లోగా డ్రైవ్ చేసిన తను ఒక్కసారిగా స్పీడ్ పెంచింది.
"ఓయ్. ఎందుకంత స్పీడ్?" స్కూటీ డ్రైవ్ చెయ్యను అన్న పిల్ల అంత స్పీడ్ గా వెళ్తున్నందుకు చాల కంగారు మొదలైంది నాలో.
"ఆం. మీ అబ్బాయిలంతా చేతిలో బైక్ ఉంటే స్పీడ్ గా వెళ్తూ ఫోజులు కొడతారు కదా, అసలు ఏముందో ఆ స్పీడ్ లో చూద్దాం అని" అంటూనే ఇంకా వేగం పెంచింది.

అంతలోనే, "ఓయ్... చాలు చాలు స్లో స్లో" అంటూ నేను సరదాగా అరిచాను.
కానీ, తనలో భయం మొత్తం పోగొట్టుకుని ,ఆ స్పీడ్ ని ఎంజాయ్ చేస్తూ గట్టిగా అరుస్తూ , నవ్వుతూ హ్యాపీగా డ్రైవ్ చేసింది.

ఆరోజు సాయంత్రం

తను ఇంటికి వెళ్ళిన గంట తర్వాత ఫోన్ వచ్చింది, "చాలా హ్యాపీగా ఉన్నాను. లాంగ్ డ్రైవ్.

అది కూడా నేను డ్రైవ్ చేసాను . సూపర్ ఎగ్జైట్మెంట్ ఫీల్. థాంక్యూ యు థాంక్యూ సో మఛ్" అంటూ ఆనందంతో చెప్పింది. వెంటనే తన వాట్సాప్ స్టాటస్ కూడా ఛేంజ్ చేసింది.

తన మాటలతో సంతోషంగా ఉన్న నేను ఇలా తన ఆనందాన్ని స్టాటస్లో చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను, "ఐయామ్ మఛ్ మోర్, వెన్ ఐయామ్ విథ్ యూ... స్టిల్ ఐ కెన్ ఫీల్ ఇట్ "

డిసెంబర్ 24-2016

తన ఫ్యామిలీతో తిరుపతి వెళ్లింది. జర్నీ స్టార్ట్ అయినప్పటినుండి ప్రతీ విషయం నాతో వాట్సాప్లో చెపుతూనే ఉంది. ఇప్పుడే ట్రైన్ ఎక్కాం , తిరుమలకి వచ్చాం, రూమ్ కోసం వెయిటింగ్, స్టెప్స్ ఎక్కటం స్టార్ట్ చేసాం, ఇలా ప్రతీ విషయం నాతో షేర్ చేసుకుంటుంటే తను నన్ను ఎంత మిస్ అవుతోందో అర్ధమయింది.
జనవరి 1-2017



తను తిరుపతి నుంచి వచ్చాకా అదే తనని కలవడం. నాకోసం తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా ఇచ్చింది.
"ఈ నాలుగు రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను తిరుపతిలో ఉన్నా సరేే ప్రతీక్షణం నువ్వే గుర్తొచ్చావ్. అక్కడ ఈ 'స్మైలీ' కీచైన్ చూసాను నువ్వే గుర్తొచ్చావ్ దీనిని నీ కోసమే తీసుకొచ్చాను దీనిని చూసిన ప్రతీసారి నీ పెదాల మీద చిరునవ్వోచ్చి వచ్చి నేను గుర్తు రావాలి" అంటూ నా బుగ్గలు పట్టుకుని ఆ కీచైన్ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది.
"నా పెదాల మీద చిరునవ్వు రావాలంటే ఈ 'స్మైలీ' కీ చైన్ కాదు, నీ పేరు తలుచుకున్నా చాలు" అని అందంగా చెప్పటానికి ట్రై చేసాను .

"హేయ్ నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో నేను ఒక్కసారి కూడా నిన్ను పేరు పెట్టి పిలవలేదు. అలా అని అందరూ పిలిచే పేరుతో పిలవడం నాకు ఇష్టం లేదు అందుకే నాకు నచ్చే పేరు ఒకటి సెలక్ట్ చేసాను నీకు ఓకే ఐతే అదే పేరుతో పిలుస్తా" అని తను అనగానే,
"ఔనా... ఏంటటా ఆపేరు" అని ఆత్రుతగా అడిగా
"లక్కీ"అని ప్రేమగా చెప్పి, "లక్కీ అంటే మీనింగ్ తెలుసా, లక్కీ: ద ఫస్ట్ వన్ హూ టచ్డ్ యువర్ హార్ట్ ఇన్ ద రైట్ వే " అని నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది. ఇక ఆరోజు నుంచి నన్ను లక్కీ అని పిలవడం స్టార్ట్ చేసింది.

జనవరి 28-2017
తాటిపూడి రిజర్వాయర్.

చాలా ప్రశాంతమైన వాతావరణం.
పెద్ద బ్రిడ్జ్ దాని చివర వాటర్ వరకూ ఉండే చిన్న మెట్లు .
చల్లని గాలి , కాళ్లని తాకే నీళ్లు , ప్రశాంతమైన వాతావరణం.
నా మనసులో మాటని తనకి చెప్పాలనుకున్నాను

"చాలా అలవాటు అయిపోయావు శశి. ప్రతీ రోజు నీ మాట, నీ పలకరింపు, నీ కోపం ,నీ అల్లరి. ఇవన్ని బాగా అలవాటయిపోయాయి. ఇవేవి లేకపోతే నేను లేనేమో అన్నంతగా అలవాటయిపోయాయి.
మనం ఫస్ట్ టైం కలిసిన ఆ క్షణం. ఆనందం ఎంత అపురూపంగా ఉంటుందో తెలిసింది.
నీతో కలసి వైజాగ్ వరకూ ట్రావెల్ చేసిన ఆ ఫస్ట్ జర్నీ. నువ్వు నాకొకసారి ప్రేమగా తినిపించిన పానీపూరి, ప్రతీసారి నీ ఫీలింగ్స్ అన్నీ వాట్సాప్ స్టాటస్లో చెబుతుంటే నాలో నేను చాలా ఆనందపడేవాడిని. నువ్వు నన్ను లక్కీ అని ప్రేమగా పిలిచిన ప్రతీసారి నాలో ఉన్న నేను కొత్తగా పుట్టానా? అని అనిపిస్తుంది. ఐ లవ్ యూ శశి" అని నా మనసులో మాట చెప్పాను. తను నా చెయ్యి పట్టుుకుని , నా భుజం మీద తల పెట్టుకుని నేను చెప్పే మాటలు వింటుంటే నా వందేళ్ల జీవితం ఆ ఒక్కక్షణంలో చూసినంత ఆనందంగా అనిపించింది.


కాని తను ఎటువంటి సమాధానం చెప్పలేదు.
నా మాటలు అన్ని విని, "సరే! ఇక టైం అవుతోంది వెళ్దాం పద" అంది.
"శశి ..ఏం అయింది?"
"ఏం లేదు టైం అవుతోంది"
"శశి నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా?"
అయినా, తను మాత్రం ఏం మాట్లాడలేదు నేను కూడా పెద్దగా ఫోర్స్ చెయ్యలేదు.
కానీ దాని తర్వాత మా మద్య దూరం కూడా రాలేదు నార్మల్ గానే ఉన్నాం.
కానీ ఈ విషయం కూడా ఎప్పడూ తీసుకురాలేదు.

ఫిబ్రవరి14-2017

అప్పటివరకూ నా మనసులోని మాటకు తననుంచి ఎటువంటి సమాధానం లేదు.
అందుకని ఏం చెయ్యాలో తెలియక నార్మల్ గా ఎప్పటిలానే ఆరోజు కూడా కలిసాము.

ఆ రోజు...



ఇంకా ఉంది

(రేపు సాయంత్రం)

*** ***
పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 



*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.

*** ***