కదిలే కాలమే జీవితం


ప్రేమ, వర్ణించలేని భావం
ప్రేమ, వద్దనుకోలేని భాద
ప్రేమ, గుర్తుండిపోయే జీవిత గమకం 
ప్రేమ, నెమరువేసుకునే తీపి జ్ఞాపకం  

అలాంటి ప్రేమను అనుభూతిచెందడానికి,
 గొప్ప మనసుతో పాటు గొప్ప వ్యక్తిత్వం కూడా కావలి. 

మన జీవిత గమనంలో ఎన్నో సంధర్భాలలో, 
ప్రేమలో ఉన్నానేమో అనే సందేహం, 
ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. 

కానీ అది నిజంగా ప్రేమో, కాదో ఒక్క క్షణం ఆగి చూస్తే వివరంగా మనకే అర్ధమవుతుంది.
 అంత ఆగి ఆలోచించే మనస్తత్వంతో మనం ఈ కాలంలో లేము. 

మనదంతా యూట్యూబ్ కాలం... 
ఎంత అద్భుతమైన విషయమైనా రాస్తే చదివే రోజులు పోయి... 
చూపిస్తే చూసే రోజులు వచ్చేసాయి... 

ఏంటండీ ఈ మార్పు అంటే... 
"చదివితే బావుంటుందండి, చాల బావుంటుంది... 
కానీ సమయం వృధా అవుతుంది, 
అదే వీడియో అనుకోండి వెంటనే అయిపోతుంది 
రెండు నిమిషాల్లో రెండు గంటలకు సరిపడా విషయాలు తెలుసుకుంటున్నాం"
అని ఒక మెలిక పెట్టి సమర్ధించుకుంటున్నాం... 

కావాలన్నది చదివి తెలుసుకునే ఓపిక లేని మనకి, 
పొందాలనుకునే బంధం గురించి,
 ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయం కూడా లేదనిపిస్తుంది.

ప్రేమను అంత ప్రేమగా ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ సారాంశం,
 ఒక ఆలోచనని రేకెత్తిస్తుందని నమ్మకం నాకు స్పష్టంగా ఉంది. 

మనం ప్రేమిస్తున్న వారి నుండి ప్రేమను ఆశించడం తప్పుకాదు. 
కానీ ఆ ప్రేమతోనే మన జీవితం సాగుతుందనుకోడం మూర్ఖత్వమే అవుతుంది. 

'కదిలే కాలమే జీవితం' అని అన్నాడొక సినీ కవి
నిజమే,
కదిలే కాలమే జీవితం... 
అడ్డంకులు 
ఆటుపోట్లు 
అవధుడుకులు 
ఎన్నొచ్చినా, జీవితం గమనం ఆగిపోకూడదు... సాగుతూనే ఉండాలి...

ప్రేమించిన వారు దూరమయ్యారనో,
ఆశించినది దక్కలేదనో
ఏమొచ్చినా, జీవితం గమనం ఆగిపోకూడదు... సాగుతూనే ఉండాలి...
ఎందుకంటే 'కదిలే కాలమే జీవితం'

నాన్న నడక నేర్చిపించి వదిలేశాక, మన కాళ్ళమీదనే నడిచాం
అమ్మ తినిపించడం ఆపేసాక, మన చేతితోనే తినటం మొదలుపెట్టాం
అన్నయ్య తోడు రావడం మానేసాక, ఒంటరిగానే నడుస్తూ వెళ్ళాం
స్నేహితుడు సలహా ఇవ్వడం విరమించాక, సొంతంగానే నిర్ణయం తీసుకోవడం మొదలుపెట్టాం
అందుకే 'కదిలే కాలమే జీవితం'

మన జీవిత ప్రయాణంలో మన మనసుకు దగ్గరగా ఉన్న మనుషులు, దూరమవుతున్న ప్రతీ సారీ,
బాధపడుతూనే ఉన్నాం, భవిష్యత్తుని చూస్తూ భయపడుతూనే ఉన్నాం.
కానీ 'కదిలే కాలమే జీవితం'

కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వచ్చినపుడు మనంతలా మనమే జీవితాన్ని దర్జాగా నడిపిస్తున్నాం
అందుకే 'కదిలే కాలమే జీవితం'

జీవితమే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్!!
భవిష్యత్తేంటి అనే విషయం పక్కన పెడితే,
గంట తరువాత ఏంటి అనే దాన్ని మనం అంచనా వెయ్యలేం.
అలాంటిది ప్రేమించిన వారు కాదన్నారని, భవిష్యత్తే లేదనుకోవడం క్షమించరాని అపరాధం అవుతుంది.
అందుకే 'కదిలే కాలమే జీవితం'

సంతోషం, ఆనందం, సుఖం
మూడింటికి వ్యత్యాసం తెలిసిన రోజు, మన ప్రయాణం మధురంగా మారుతుంది.
ఎందుకంటే 'కదిలే కాలమే జీవితం'

జీవితంలో కచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన విషయాలు కొన్ని ఉంటె,
సర్దుకుపోవాల్సిన విషయాలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి...
అలానే, విడిచిపెట్టి నడవాల్సిన వ్యక్తులు కొందరు ఉంటారు...
ఎందుకంటే 'కదిలే కాలమే జీవితం'

మనం ఆగి ఆలోచిస్తున్న వ్యక్తి, 'నిజంగా మనం ఆగి ఆలోచించేంత ప్రాముఖ్యత కలిగిన వారా?'
అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే,
బహుశా ఆగి ఆలోచించాల్సిన అవసరం మనకు ఉండకపోవచ్చేమో...

మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆగేలా చెయ్యలేదు,
తోబుట్టువులూ ఆగేలా చెయ్యలేదు
స్నేహితులు ఆగేలా చెయ్యలేదు

కానీ ఒక్క వ్యక్తి,

ఆ ఒక్క వ్యక్తి, మనల్ని ఆగేలా చేసారంటే,
ఆలోచించేలా చేశారంటే,

ఆగేలా చేసిన వారి తప్పా?
ప్రయాణం ఆపి భాదపడుతున్న మన తప్పా?

సృష్టిలో అన్నిటికంటే గొప్పది మన జీవితం,
మన జీవితం మనల్ని నడిపిస్తుంది కాబట్టే,
మిగతా గొప్ప విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం,
అవి గొప్పవని గుర్తించగలుగుతున్నాం.

ఎంతో గొప్పదైన జీవితాన్ని పక్కనపెట్టి,
మన ప్రయాణాన్ని పక్కనపెట్టి,

మనల్ని 'మన' అనుకోని, మనం 'మన' అనుకునే వారికోసం
పక్కన పెట్టడం

పక్కన పెట్టడం 

మన జీవితాన్ని పక్కన పెట్టడం 

'మన' జీవితాన్ని పక్కన పెట్టడం 

ఎంతవరకు నిజమో...
మనకు మనమే ఆలోచించుకుందాం.

ఒక్క ప్రశ్న,
ఒకే ఒక్క ప్రశ్న

ఆగి ఆలోచించాలా?

అనే ప్రశ్న,

అంతే విలువైన సమాయనా, మనకి తారసపడినప్పుడు,
ఆగి ఆలోచించాలో వద్దొ,
మనకి మనమే నిర్ణయం తీసుకోగలం.

ఎందుకంటే 'కదిలే కాలమే జీవితం'





కథ అని చెప్పి పాత్రలు లేకుండా ఒక సారాంశం రాశాడేంటి అని చూస్తున్నారా?
ఒక మనిషిని అలరించేది కథ అయితే, అదే మనిషిలో కదలిక తీసుకొచ్చేది కూడా కథే.

ఈ రచన ఒక్కరిని ఆలోచింపజేసినా నా ఈ ప్రయత్నం సఫలీకృతం అయినట్టే.



ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఈ రచన మీకు స్ఫూర్తినిస్తే షేర్ చేసి మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా చెయ్యండి.


*** ***

ప్రేమకు నిర్వచనం చెప్పిన నవల


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 




*********************************************************************************

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమనో బాధనో ఒకరికి తెలియచెప్పాలన్నా 

ఈ లింక్ క్లిక్ చేసి మాకు చెప్పండి 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాను.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



________X ______