కదిలే కాలమే జీవితం - 2

గమనిక: ఈ రచన చదివే ముందు 'కదిలే కాలమే జీవితం' అనే రచన తప్పక చదవండి.



'కదిలే కాలమే జీవితం' అనే రచనకు వచ్చిన స్పందన, 
ఇలాంటి మరిన్ని రచనలు చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది. 

పాఠకుల నుండి వచ్చిన ఒక ప్రశ్న, ఈ రచనను ముందుకు తీసుకెళ్లే దిశగా నన్ను ప్రేరేపించింది. 

ఆ ప్రశ్న ఏంటంటే :

మనసు అక్కడ నుండి కదలటంలేదండి. దానిని ఎలా కదిలించాలి?
మంచి జ్ఞాపకాలతోనా? మనసుని ముక్కలు చేసిన గాయాలతోనా?

అసలు ముందు మనసు కదలకపోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. 

మనసు కదలకపోవడం అంటే జ్ఞాపకాలు విడిపోకుండా మనల్నే వెంటాడుతుండటం.
అవే జ్ఞాపకాలు, మారే ఇతర పనిని చేపట్టనివ్వకుండా మనల్ని ఆపుతుండటం.

కోరిక, భావం, అనుభూతి, జ్ఞాపకం

ఈ నాలుగు చాల దగ్గరగా ఉన్నా, వీటిల్లో చాల వ్యత్యాసం ఉంది.

మనం ఏదైనా జరగాలనుకోడం కోరిక.
ఒక విషయాన్నీ గురించి మనకొచ్చే ఆలోచన, భావం.
అదే విషయం మనం అనుభవిస్తే వచ్చేది, అనుభూతి.
అవే అనుభూతులు జ్ఞాపకాలుగా మారుతుంటాయి.

మానవుడి సమస్యలకు అతని కోరికలే కారణం అని చెప్పిన గౌతమ బుద్ధుడిని ఒక సారి గుర్తుచేసుకుంటూ,


మనిషి జీవితంలో కొరికలే అనర్ధాలకు, ఆశయాల చేధనకు మూలమనేది నా భావన.
ఎందుకంటే 'కదిలే కాలమే జీవితం'



మనసుని ఎలా కదిలించాలి?
మంచి జ్ఞాపకాలతోనా? మనసుని ముక్కలు చేసిన గాయాలతోనా?

మన శరీరం భౌతికం. కంటికి కనిపించే వాస్తవం.
మన మనస్సు కంటికి కనిపించని ఒక అద్భుతం.

శరీరం చలనం కోల్పోయినప్పుడు,
ముందుకు కదలడం కష్టమయినప్పుడు
వ్యక్తులో, వస్తువులో మనల్ని{మన శరీరాన్ని} కదిలించే ప్రయత్నం చేస్తారు.
చాల సందర్భాల్లో కదలిక తీసుకొస్తారు.

కానీ మనస్సు అనే అద్భుతం కదలడం కష్టమయినపుడు,
దానిని కదిలించడానికి బయటనుండి వచ్చే ఒక మాట, ఒక తోడు
మనల్ని ఆలోచింపజేస్తాయేమోగాని,
మన సంకల్పం మాత్రమే దానిని ముందుకు కదిలేలా చేస్తుంది.
ఎందుకంటే మనసు, మనకు మాత్రమే సంబంధించిన అద్భుతం.

అంటే మన మనసుని కదిలించే శక్తీ ఇతరుల్లో ఉన్నా,
ఆ శక్తిని మనం ఎంత వరకు తీసుకుంటున్నామనేది మన చేతిలోనే ఉంటుంది.

అంటే మన మనసు కదలాలంటే,
కదిలించాలన్న మన సంకల్పం ఒక్కటే దానికి ప్రేరణ.
సంకల్పం దృఢమైనదైతే, మనస్సు అనే అద్భుతాన్ని కదిలించడం తేలికైన విషయమే.


ఇక ఎలా కదిలించాలి?
మంచి జ్ఞాపకాలతోనా? మనసుని ముక్కలు చేసిన గాయాలతోనా?
అనే విషయానికొస్తే,

రేపు అనేది లేదని తెలిస్తే, ఈరోజు ఎవ్వరం నిద్రపోము.

రేపు బాగుంటుందనే ఆశతోనే
నిన్నటి గాయాన్ని మరిచిపోతూ,
నేటి కష్టాన్ని నమ్ముకుంటున్నాడు మనిషి.

మంచి జ్ఞాపకమంటే, పెదాలమీద చిరునవ్వు తీసుకొచ్చే అందమైన సందర్భం.
మనసుని ముక్కలు చేసిన గాయమంటే, కంట్లో కన్నీరు తెప్పించే ఓక చేదు సన్నివేశం.

మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే,
ఒక విఫలమైన బంధంలో కూడా,
మనసుని గాయపరిచిన సన్నివేశాలకంటే,
పెదాలమీద చిరునవ్వు తెప్పించే మంచి జ్ఞాపకాలే ఎక్కువుగా ఉంటాయనేది సత్యం.

అలా లేకుంటే, నిజంగా అదొక బంధమేనా అనే ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి !

ఆఖరిగా, రేపటి ఆశయాల సాధనకోసం నిన్నటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,
నేటి సంకల్పాన్ని విడువనంతవరకు మన జీవిత ప్రయాణం సాఫీగానే సాగిపోతుంది.

ఈ చిన్న జీవితంలో మనకు కావలసింది కూడా అదే.
ఒక సాఫి ప్రయాణం.

ఒడిడుకులు ఉన్నా,
శిఖరాలను అధిరోహిస్తున్నా,
పాతాళ లోతులను చవిచూస్తున్నా,
సంతోషంగా మన జీవిత గమనాన్ని నిర్దేశించడమే మన ముందు ఉన్న ద్యేయం.
ఆ దిశగా అడుగులు వేద్దాం.






ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఈ రచన మీకు స్ఫూర్తినిస్తే షేర్ చేసి మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా చెయ్యండి.


*** ***

ప్రేమకు నిర్వచనం చెప్పిన నవల


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 




*********************************************************************************

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమనో బాధనో ఒకరికి తెలియచెప్పాలన్నా 

ఈ లింక్ క్లిక్ చేసి మాకు చెప్పండి 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాను.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



________X ______