తిరిగిరా ప్రియతమా



తిరిగిరా ప్రియతమా ! తిరిగిరా ప్రియతమా !
చీకటి బ్రతుకు నుండి నను విడిపించుమా !
చితిమంటల కోరలనుంచి బ్రతికించుమా !
ఆవేశమంట పలికిన మాట పాపమా !
పొరపాటు పడితి నను మన్నించుమా !
మధురానుభూతులివి మరచిపో మిత్రమా !
చిరస్థాయి స్నేహమిది మరలరా స్నేహమా !
తిరిగిరా ప్రియతమా ! తిరిగిరా ప్రియతమా !