కోపమా నేస్తమా



కోపమా నేస్తమా... కబుర్లు చెప్పే నా పైనా?
మాట్లాడవా ఇకపైన... ?

కోపమా నేస్తమా... వాదించె నా పైనా?
పోట్లాడవా ఇకపైన... ?

కోపమా నేస్తమా... సంతోషించె నా పైనా?
పంచుకోవా ఇకపైన... ?

కోపమా నేస్తమా... ప్రేమించె నా పైనా?
ప్రేమించవా ఇకపైన... ?

కోపమా నేస్తమా... నిత్యం తలచె నా పైనా?
మన్నించవా ఇకనైనా... ?

కోపమా నేస్తమా... కవ్వించె నా పైనా?
కనికరించవా ఇకనైనా... ?

భాదించనా ఎపుడయినా... ?
నిందించనా కలనయినా... ?
బందించినా క్షణమయినా... ?

మదిలో మెదిలె నీ రూపం 
కోపంగా అది అపురూపం 
విసిరేరాదొక దరహాసం
జ్ఞాపకమవదా ఈ సమయం