నీ నవ్వు




నీ నవ్వు నను నాకు పరిచయం చేసింది
నువు పలికిన నా పేరు సరికొత్తగా వినపడుతుంది
నీ కనుల మెరుపు నాలో గర్వం పెంచింది
నీ చూపుల కైపు నను మత్తెక్కిచింది
నీ చిరుదరహాసం నాలో కంగారు పెంచింది
నా వెంట తోడు పలికిన నీ అడుగు నాకు ధైర్యాన్నిచ్చింది
నువు కనే కలల సామ్రాజ్యానికి అధిపతినై
నీ ఊహాలోకంలో నిన్నెత్తుకుపోయే చక్రవర్తినై
ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా
నీకు తోడుగా, నీవెంటే ఉండే నీడగా
ఈజన్మాంతం ఉండిపోడానికి సిద్ధంగా ఉన్నాను