కరిగిపో కాలమా




కాలమా కరిగిపో... నా కన్నులనుండి 
నేస్తమా వదిలిపో... నా హృదయమునుండి 
అలసిపోయిన ఎదురుచూపులు చేరేనా గమ్యాన్ని ?
దరికి చేరిన నిట్టూర్పులు ప్రశ్నించేనా నా గమనాన్ని ?

అక్కున చేర్చుకున్న భావోద్వేగాలు 
అద్భుతమైన ఆనందసమయాలు
అంతం చూడని సంభాషణలు 
ఇంతలోనే కోల్పోయాయి వాటి మనుగడలు 

చిరునవ్వులు మనువిల్లాయే
ఆప్యాయత అర్ధరహితమయిపోయే 
కలయిక అనే సత్యం 
కడకు చేరిన కాష్టం