గోంగూర



ఆకు పచ్చని గోంగూర
చూస్తుంటేనే నోరూర
ఆశ్వాదిద్దాం మనసారా
ఏళ్ళైనా రుచి వదలదురా

తెలుగు ఇంట ఈ గోంగూర
మగువ కనులకూ మస్కారా
భగవంతునికి కర్పూరా
లేకుంటే ఇక వెళితేరా

పులుపుగున్న ఈ గోంగూర
నచ్చేస్తుందిక ఊరూరా
రోజూ తిన్నా పరివార
మొహం కొట్టదీ   గోంగూర

రుచికరమైన గోంగూర
మన దగ్గరె  ఇది పండునురా
షేకు పెట్టిన దినారా
దొరకటమైన అరుదే రా

ఆరోగ్యానికి గోంగూర
చూపు మెరుగుకై తోడ్పడురా
దుమ్ములకు ఇది బలమేరా
కేన్సర్ ను ఇది ఆపునురా

సరిరాదు దీనికే ఆక్కూర
తింటూ జీవితం గడిపేయ్ రా
ఎవరేమన్నా గోంగూర
కూరల్లో ఇది పెద్దదొర