.ముందుమాట

తన పరిచయం నవలని అంతగా ఆదరించిన పాఠకులందరికి నా ధన్యవాదములు. మీరు చూపించిన అభిమానం, నా ప్రయాణాన్నే మలుపు తిప్పి, అమెరికాలో ఉండి తెలుగు నవల రాసిన నన్ను, రచన మీద మక్కువతో, సాహిత్యం మీద గౌరవంతో తిరిగి భారతదేశానికి వచ్చేలా చేసింది.

నా ప్రయాణానికి కారణమైన మీ అందరికి ఎప్పటికి ఋణపడి ఉంటాను.

మన కథ గురించి కొన్ని విషయాలు:
  • ఇది 14 వారాలు, ప్రతి శుక్రావారం ఒక్కో ఎపిసోడ్ చప్పున విడుదల చేయబడుతుంది. 
  • కార్తీక్, అక్షర కథ పూర్తిగా కల్పితమైనది. 
  • తన పరిచయం నవల లానే, ఇది కూడా ఆన్లైన్లో పాఠకులకు అందించిన తరువాత, పుస్తకరూపంలో ప్రచురింపబడుతుంది.


ముందుమాట 


ప్రేమ. ప్రతీ మనసుని కదిలించే భావం.


మన జీవిత ప్రయాణంలో ఎలాంటి సందర్భంలోనైనా మనం కోరుకునేది కాసింత ప్రేమ మాత్రమే.
ప్రేమలో ఆనందపు తీరాలని చేరుకోడానికి ఎంతో ప్రయాణం చేస్తూ ఉంటాం. అలాంటి సుదూర ప్రయాణంలో ఎన్నో అందమైన అనుభూతులు.


ప్రేమని ఆహ్వానించే మనసు మాత్రమే సరిపోదు, దానిని ఆస్వాదించే వ్యక్తిత్వం కూడా కావాలి. అలాంటి ప్రేమను ఆహ్వానించి, ఆస్వాదిస్తున్నామనుకుంటున్న ఎందరో ప్రేమికులు చిన్న చిన్న తగాదాలతో దూరమవుతున్నారు. మూడ్ బాలేదనో, సరిగ్గా మాట్లాడటం లేదనో, అమ్మ వద్దందనో, నాన్న తిడతాడనో, ఇలా ఎవరికి నచ్చిన కారణాలతో వారు పెడమొహం పెడుతున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించడం ఎంత ముఖ్యమో... ఆ ప్రేమతో ప్రయాణం చెయ్యడం కూడా అంతే ముఖ్యం. ఆ ప్రయాణంలో మనకు ఎదురైనా మజిలీలు, చేరుకునే తీరాలు ఎన్నో అనుభూతులని మిగుల్చుతాయి.

అలాంటి కథలలో ఇదొక కథ. మనల్ని ప్రేమతో ప్రయాణం చేయించే కథ. ఇది ఒక మంచి ప్రేమ కథ. 

మొదటి ఎపిసోడ్ వచ్చేవారం.




Popular Posts