ఒంటరితనం



గాఢనిద్రలో నీవుంటే... అఘోర కలనే కంటుంటే 
ఉద్వేగానికి లోనవుతూ... ఉలిక్కిపడి నువు లేస్తుంటే 
నీ ముందే నే లేచుంటా... లాలి పాటనే నేనవుతా 

మగువ ముఖ్యమై... మన పగకు ఆజ్యమై 
కపటి ప్రేమ తనదై... నీ చూపు నా వెను తడితే
నీ కోసమై వేచుంటా... నీ నేస్తమే నేనవుతా 

సాయంత్రపు సమయాన... సముద్రపు తీరాన 
బరువెక్కిన హృదయంతో... తడబడినడుగేస్తుంటే 
నీకు తోడుగా నేనుంటా... ప్రక్కనడుగు నే వేస్తుంటా

జీవిత గమనం కఠినమై... నిరాశ నిను కబళిస్తే 
ముందుకడుగు ఇక పాడకుంటె... దిగులు పడకు మిత్రమా 
నీ నీడనై తోడుంటా... నీ వెంట నే వస్తుంటా 

Popular Posts