అసుర సంధ్య


తలకెక్కిన మద్యపు మత్తు
తడి ఆరని సమయంలో
జన్మించిన కామపువాంఛ
ఔత్సాహిక ప్రాయంలో 


మృగాడివై లేచిందా 
నీ మర్మాంగం
తపస్సుకై చేసిందా
వికృత నాట్యం

కనపడలేదా
నీ తల్లివోలె మేనువాడ
వినపడలేదా
నీ కూతురల్లె ఆర్తమాడ


శిశువుగా పుట్టిన నీవు
పశువుగా మారావని
విషయము తెలిసిన 
నీ తల్లసువులు బాసగా మానద

మారిందా ఈ తనువు
నీ అక్కదేగదా అణువణువు
ఎందుకు నీకిక మనువు
అర్ధాంగికి మొగుడవవు


రాస్తున్న ఈ కవిత
స్పృశించుటకు ప్రతి మదిని
కావాలి మన భవిత
స్త్రీ రక్షక ప్రతిధ్వని



Popular Posts